Rainfall | హైదరాబాద్: తెలంగాణ లో జూలై 12 నుంచి 15 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. రాష్ట్రంలో పలుజిల్లాల్లో సరైన వర్షాలు కురవకపోవడంతో కరువు పరిస్థితులు వస్తయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.ఈ క్రమంలోనే వాతావరణ కేంద్రం వర్షాలకు సంబంధించి కీలక అప్‌డేట్ ఇచ్చింది. శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఈమేరకు భారత వాతావరణ శాఖ (IMD) అనేక జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
హైదరాబాద్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్లానింగ్ డెవలప్‌మెంట్ అండ్ సొసైటీ డేటా ప్రకారం, రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి హైదరాబాద్ పరిధిలో 174.6 మిమీ వర్షపాతం నమోదైంది. ఇక్కడ సాధారణ పరిధి 154 మిమీ కంటే ఎక్కువగా ఉంది. జూలై 14న నగరంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది.
ఈ కాలం ముగిసిన వెంటనే, రుతుపవనాలు బలపడి, హైదరాబాద్‌తో సహా తెలంగాణను తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో అల్పపీడన ద్రోణి (ఎల్‌పిఎ) జల్లులతో ఆ ప్రాంతం అంతటా కదులుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
ఈ జిల్లాలకు వర్షాలు..
శుక్రవారం వరకు ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షం (Heavy Rainfall ) కురిసే అవకాశం ఉంది.
శనివారం ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షం కురుస్తుంది.
ఆదివారం : ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
సోమవారం ఈ వర్షాల చివరి రోజు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..