Home Telangana తెలంగాణకు 8 కొత్త రైళ్లు: భాగ్యనగరం నుంచి తిరుపతి, జైపూర్, భువనేశ్వర్‌లకు విక్లీ స్పెషల్స్!

తెలంగాణకు 8 కొత్త రైళ్లు: భాగ్యనగరం నుంచి తిరుపతి, జైపూర్, భువనేశ్వర్‌లకు విక్లీ స్పెషల్స్!

0
13
New Trains from Hyderabad 2026
Holi special trains Time Table
Spread the love
  • కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవతో రైల్వే శాఖ కీలక నిర్ణయం
  • మే నెల నుంచే ప్రారంభం కానున్న మెజారిటీ సర్వీసులు
  • కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి కొత్త రైళ్లు

(హైదరాబాద్ – ఏప్రిల్ 21): హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేంద్ర రైల్వే శాఖ 8 కొత్త రైళ్లను (New Trains from Hyderabad 2026) ప్రకటించింది. కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి పదేపదే చేసిన విజ్ఞప్తులకు స్పందించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ఈ నూతన సర్వీసులకు పచ్చజెండా ఊపారు. ముఖ్యంగా పుణ్యక్షేత్రాలైన తిరుపతి, తిరుచానూరులతో పాటు జైపూర్, భువనేశ్వర్ వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే వారి కోసం ఈ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి

రైలు నెంబర్బయలుదేరే స్టేషన్గమ్యం (Destinations)సమయం / వారంప్రారంభ తేదీ
17607 / 08కాచిగూడతిరుచానూరుగురువారం (రాత్రి 9:30)మే 15, 2026
17601 / 02కాచిగూడశ్రీ గంగానగర్శనివారం (రాత్రి 10:00)జూలై 14, 2026
17047 / 48చర్లపల్లితిరుచానూరుబుధవారం (సాయంత్రం 6:55)మే 07, 2026
17441 / 42చర్లపల్లితిరుపతిబుధవారం (రాత్రి 9:20)మే 14, 2026
17443 / 44చర్లపల్లితిరుపతిశుక్రవారం (సాయంత్రం 4:20)మే 15, 2026
17059 / 60చర్లపల్లితిరుచానూరుఆదివారం (రాత్రి 9:15)మే 11, 2026
17067 / 68చర్లపల్లిభువనేశ్వర్సోమవారం (సాయంత్రం 6:10)మే 05, 2026
17079 / 80నాంపల్లిజైపూర్శుక్రవారం (రాత్రి 7:50)త్వరలో…

New Trains from Hyderabad 2026 : ప్రయాణికులకు లబ్ధి:

వేసవి సెలవుల అనంతరం ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండటంతో ఈ కొత్త రైళ్లు ఎంతో ఊరటనివ్వనున్నాయి. ముఖ్యంగా చర్లపల్లి టెర్మినల్ నుంచి అత్యధికంగా 5 రైళ్లను కేటాయించడం గమనార్హం. తిరుచానూరుకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేకంగా వీక్లీ సర్వీసులు ప్రవేశపెట్టడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి, రైల్వే మంత్రికి కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


జాతీయవాద వార్తలు, దేశభక్తి కథనాలు, తాజా టెక్నాలజీ, లైఫ్ స్టైల్ విశేషాల కోసం వందేభారత్ వెబ్‌సైట్‌ను సందర్శిస్తూ ఉండండి. మా తాజా అప్‌డేట్స్ ఏవీ మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే మా సోషల్ మీడియా వేదికలపై కనెక్ట్ అవ్వండి: వాట్సప్ ఛానల్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్)

ఈ వార్త మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దేశహితం కోరుకునే మీ స్నేహితులతో ఈ కథనాన్ని తప్పకుండా షేర్ చేయండి. జై హింద్​

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here