
Metro Rail | మార్చి నాటికి 3 హైదరాబాద్ మెట్రో కొత్త కారిడార్లకు డీపీఆర్‌లు
Hyderabad Metro Rail : శామీర్‌పేట, మేడ్చల్, ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ల వివరణాత్మక ప్రాజెక్టు నివేదికలు (DPR) మార్చి చివరి నాటికి సిద్దమవుతాయని , కేంద్ర ఆమోదం కోసం సమర్పించబడతాయని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ MD NVS రెడ్డి తెలిపారు.హైదరాబాద్‌లో 'గ్రీన్ క్రూసేడర్స్' కార్యక్రమంలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నిర్వహించిన 'గ్రీన్ తెలంగాణ సమ్మిట్- 2025'లో ప్రసంగించిన రెడ్డి, హైదరాబాద్‌లోని నాలుగు దిశలలో మెట్రో రైలు నడపాలనే ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రణాళికలకు అనుగుణంగా HMRL పనిచేస్తోందని అన్నారు.Metro Rail విస్తరణలో మారానున్న నగర రూపురేఖలుకొత్త మెట్రో కారిడార్లు హైదరాబాద్ భౌతిక రూపురేఖలను మారుస్తాయని హామీ ఇస్తూ, హైదరాబాద్ త్వరలోనే ఉన్నత జీవన ప్రమాణాలతో ప్రపంచ స్థాయి నగరంగా మారుతుందని అన్నారు.పాత బస్తీ (old city) లోని హైదరాబాద్ మెట్రో దారుల్ షిఫా - పురానీ హవేలి మీదుగ...