ధరణికి సర్కారు మంగళం.. ప్రభుత్వం కీలక ప్రకటన
Hyderabad : గత బిఆర్ ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ (Dharani Portal) ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో త్వరలో ఆర్‌ఓఆర్ చట్టాన్ని ( ROR Act) తీసుకువస్తామని వెల్లడించింది. ఈమేరకు ధరణి పోర్టల్ పై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivasa Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెలాఖరులోగా కొత్త చట్టాలన్ని అమల్లోకి తెస్తామని ఆయన తెలిపారు. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా రూపొందించామని, ప్రజల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు.
దసరా లోపు డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ
రాష్ట్రలో ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను దసరా లోపు పేద ప్రజలకు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇక, వెంటనే మరమ్మత్తులు మౌలిక వసతులు కల్పిస్తాం. ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. ప్రతిపక్షాల సలహాలు, సూచన...