
అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ మృతి
Acharya Satyendra Das | రామాలయ ప్రధాన పూజారి ఆచార్య మహంత్ సత్యేంద్ర దాస్ బుధవారం ఉదయం కన్నుమూశారు. 85 సంవత్సరాల వయసులో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ లక్నోలోని సంజయ్ గాంధీ పీజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SGPGI)లో చికిత్స పొందుతున్నారు.మహంత్ సత్యేంద్ర దాస్(Satyendra Das)ను మొదట అయోధ్య(Ayodhya) లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు, కానీ తరువాత అధునాతన వైద్య సంరక్షణ కోసం SGPGIకి తరలించారు. ఆయన మధుమేహం, అధిక రక్తపోటుతో సహా తీవ్రమైన ఆరోగ్య పరిస్థితులతో పోరాడుతున్నారు. ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం సాయంత్రం SGPGIని సందర్శించి ఆయన ఆరోగ్యాన్ని పరిశీలించారు.Acharya Satyendra Das : రామ జన్మభూమి ఉద్యమంలో చురుకైన ప్రాత్రRam Janmabhoomi Movement : డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదు కూల్చివేతకు ముందు నుంచి మహంత్ సత్యేంద్ర దాస్ రామాలయ (Ram Templ...