Home తాజా వార్తలు తెలంగాణపై నిప్పుల వర్షం: 44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ‘ఆరెంజ్’ అలర్ట్! ‌‌– Heatwave...

తెలంగాణపై నిప్పుల వర్షం: 44 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు ‘ఆరెంజ్’ అలర్ట్! ‌‌– Heatwave 2026

0
6
Heatwave 2026
Spread the love
  • వచ్చే మూడు రోజులు తీవ్రమైన వడగాలులు..
  • అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక!

Heatwave 2026 : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటగా, రానున్న మూడు రోజుల్లో మరో ఒకటి నుంచి రెండు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అకాల వడగాలుల ముప్పు పొంచి ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 నుంచి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ ‘ఆరెంజ్’ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, మెదక్ అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది.

తీవ్రమైన వడగాలుల ముప్పు..

రానున్న 48 గంటల్లో పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
బుధవారం: ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలుల ప్రభావం ఉంటుంది.
గురువారం: ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ‘ఎల్లో’ అలర్ట్ జారీ చేశారు.

Heatwave 2026 : ప్రజలకు సూచనలు:

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రాకుండా ఉండటం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి తగినంత నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం తీసుకోవాలని కోరుతున్నారు.


🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here