Home Special Stories Azad Bose Fauz | కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు బైక్ యాత్ర విజయవంతం

Azad Bose Fauz | కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు బైక్ యాత్ర విజయవంతం

0
8
Azad Bose Fauz
Spread the love

భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తన ప్రాణాలను పణంగా పెట్టి, ఆజాద్ హింద్ ఫౌజ్ (Azad Bose Fauz) సైన్యాన్ని నిర్మించిన మహోన్నత నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subhash Chandra Bose). దేశం కోసం సర్వస్వం అర్పించిన నేతాజీ మరణంపై దశాబ్దాలు గడుస్తున్నా నేటికీ స్పష్టమైన నిజాలు వెలుగులోకి రాలేదు. జపాన్‌లోని రేంకోజీ ఆలయంలో ఉన్నట్లు భావిస్తున్న నేతాజీ అస్థికలను తిరిగి మాతృభూమికి తీసుకురావాలనే పట్టుదలతో, ఆయన త్యాగాన్ని దేశప్రజలకు వివరించాలనే మహోన్నత ఆశయంతో ‘ఆజాద్ బోస్ ఫౌజ్’ సంస్థ నడుం బిగించింది.

ఈ సంస్థ ప్రతినిధులు మండు వేసవిని సైతం లెక్కచేయకుండా చేపట్టిన “జస్టిస్ ఫర్ నేతాజీ” దేశవ్యాప్త బైక్ యాత్రలో అత్యంత కీలకమైన ఘట్టం ముగిసింది. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన వీరి నిర్విరామ యాత్ర రోజుల తరబడి సాగి, ప్రస్తుతం విజయవంతంగా కాశ్మీర్‌కు చేరుకుంది. ఈ యాత్ర దిగ్విజయంగా ముగిసిన సందర్భంగా వారు దేశప్రజల ముందు, కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచిన 4 ప్రధాన విన్నపాలు/డిమాండ్లు ఇవే:

Azad Bose Fauz” బైక్ యాత్ర ప్రధాన ఉద్దేశాలు – డిమాండ్లు:

  1. మరణంపై నిజాలు వెల్లడించాలి: దేశానికి స్వాతంత్ర్యమొచ్చి దాదాపు ఎనిమిది దశాబ్దాలు గడుస్తున్నా.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణానికి సంబంధించి స్పష్టమైన నిజాలను వెల్లడించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహిస్తోంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పూర్తి నిజాలను ప్రజల ముందుకు తీసుకురావాలి.
  2. డిఎన్ఏ (DNA) పరీక్షతో న్యాయం చేయాలి: తన తండ్రి గారి అస్థికలకు సంబంధించిన స్పష్టమైన నిజం తేలాలని, అవసరమైతే శాస్త్రీయ నిరూపణ కోసం తనకు డీఎన్‌ఏ (DNA) టెస్ట్ చేయడానికైనా సిద్ధమేనని నేతాజీ కుమార్తె కేంద్ర ప్రభుత్వానికి వేడుకుంటున్నారు. ఆమె విన్నపాన్ని స్వీకరించి, తక్షణమే ప్రభుత్వం న్యాయం చేయాలి.
  3. స్మృతి స్థలాలు, మ్యూజియంల ఏర్పాటు: నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్ఫూర్తిదాయ
  4. కమైన భావాలను, దేశభక్తిని భావితరాలకు పక్కాగా అందించేలా దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ నేతాజీ స్మృతి స్థలాలు మరియు ప్రత్యేక మ్యూజియంలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
  5. NH 44 జాతీయ రహదారికి నేతాజీ పేరు పెట్టాలి: భారతదేశంలోనే అత్యంత పొడవైన, అతిపెద్ద రాజమార్గమైన నేషనల్ హైవే 44 (NH 44) కి “నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ రహదారి”గా పేరు పెట్టాలి. ఇది దేశ గర్వానికి, ఆయన త్యాగానికి నిజమైన ప్రతీకగా నిలుస్తుంది.

కన్యాకుమారి గడ్డ నుంచి కాశ్మీర్ మంచు కొండల దాకా బైక్‌లపై ప్రయాణిస్తూ, నేతాజీ ఆశయాలను ఊరూరా చాటిన ‘ఆజాద్ బోస్ ఫౌజ్ (Azad Bose Fauz)’ దేశభక్తికి ప్రతి ఒక్కరూ శిరస్సు వంచి నమస్కరిస్తున్నారు. ఈ యాత్ర ద్వారా దేశంలో సరికొత్త దేశభక్తి చైతన్యం వెల్లివిరుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here