రూ.18,999కే 43 అంగుళాల QLED TV : జియోటెలీ OS తో కోడాక్ బడ్జెట్ బ్లాస్టర్
Kodak 43-inch QLED Smart TV న్యూఢిల్లీ : కోడాక్ టీవీ ఇటీవల జియోతో కలిసి పనిచేసి, తన మొట్టమొదటి జియోటెలి ఓఎస్-ఆధారిత స్మార్ట్ టీవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. 22 భారతీయ భాషలకు మద్దతుతో, ఇది భారతదేశ విభిన్న వినోద అవసరాలకు అనుగుణంగా రూపొందించింది. AI కంటెంట్, ప్రధానమైన OTT ప్లాట్‌ఫారమ్‌లు, ప్రాంతీయ ఛానెల్‌లు, గేమింగ్ కంటెంట్ ను అందిస్తుంది.Kodak 43-inch QLED TV ధర, లభ్యతజియోటెలీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన కోడాక్ కొత్త 43-అంగుళాల QLED 4K స్మార్ట్ టీవీ ఇప్పుడు రూ.18,999కి కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇది అమెజాన్ ఇండియా స్టోర్ నుంచి కొనుగోలు చేయొచ్చు.అద్భుతమైన డిస్ప్లే43-అంగుళాల QLED 4K డిస్ప్లే స్మార్ట్ టీవీ 1.1 బిలియన్లకు పైగా రంగులు, HDR సపోర్ట్ తో స్పష్టమైన దృశ్యాలను అందిస్తుందని పేర్కొంది. ఈ స్మార్ట్ టీవీ సొగసైన, బెజెల్-లెస్ ఎయిర్‌స్లిమ్ డిజైన్‌తో వస్తుంది. ఇది ...