
తిరుపతిలో సకల సౌకర్యాలతో అధునాతన బస్టాండ్ – Tirupathi New Bus Terminal
Tirupathi New Bus Terminal | కలియుగ దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం తిరుపతిలో అకల సౌకర్యాలతో భారీ బస్టాండ్ కాంప్లెక్స్ అందుబాటులో రాబోతోంది. ఒకేచోట అన్నీ సౌకర్యాలు లభించేలా ప్రస్తుత బస్టాండ్ స్థానంలోనే అత్యాధునిక అల్ట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. సుమారు రూ.500 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందులో బస్టాండ్‌తో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు ఇలా అన్ని వసతులు ఉండనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్థలాన్ని ఇవ్వనుండగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ కొంత పెట్టుబడి పెట్టనుంది. ప్రైవేటు సంస్థ ద్వారా మిగిలిన నిధులను సమకూరుస్తారు. తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ప్రతిబింబించేలా దీని డిజైన్ ను రూపొందించారు. తిరుపతి బ...