
AP TG Sankranti Holidays 2025 : హైదరాబాద్: సంక్రాంతి పర్వదినానికి సంబంధించి తెలంగాణ ఇంటర్ బోర్డు సెలవులను ప్రకటించింది. జనవరి 13 నుంచి 16 వరకు ఇంటర్ కళాశాలలకు సెలవులు మంజూరు చేస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కళాశాలలు తిరిగి 17న ప్రారంభమవుతాయని పేర్కొంది. సంక్రాంతి సెలవుల్లో విద్యార్థులకు కళాశాలలు ఎలాంటి తరగతులు నిర్వహించొద్దని ఆదేశించింది. నిబంధనలు అతిక్రమించి క్లాసులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. 11న (రెండో శనివారం), 12న (ఆదివారం) కావడంతో మొత్తం ఆరు రోజుల పాటు సెలవులు వచ్చాయి.
కాగా తెలంగాణ ప్రభుత్వం కూడా సంక్రాంతి సెలవులపై స్పష్టత ఇచ్చింది. జనవరి 11 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. అకడమిక్ క్యాలెండర్ లో ఈనెల 13న భోగి, 14న సంక్రాంతికి సెలవులు ఇచ్చింది. తాజాగా విద్యాశాఖ హాలిడేస్ పై క్లారిటీ ఇచ్చింది. భోగికి ముందు రోజు అంటే జనవరి 11న రెండో శనివారం.. ఆ తర్వాత ఆదివారం… అంటే జనవరి 11 నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభమవుతాయి. జనవరి 17 శుక్రవారంతో సెలవులు ముగుస్తాయి.
ఆంధ్రప్రదేశ్ లో సెలవులు ఇలా..
AP TG Sankranti Holidays 2025 : ఇక ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులను విద్యాశాఖ ప్రకటించింది. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి పండుగ సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. 2024-25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే సెలవులిచ్చారు. ఇటీవలి వర్షాల కారణంగా స్కూళ్లకు సెలవులు వచ్చాయి. దీంతో సంక్రాంతి సెలవులు తగ్గిస్తారని ప్రచారం జరిగినా… అందులో నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..