
Holi special trains : హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) దేశవ్యాప్తంగా ప్రధాన గమ్యస్థానాలను కలుపుతూ 14 ప్రత్యేక హోలీ రైళ్లను ప్రకటించింది. ప్రయాణీకులు తమకు ఇష్టమైన వారితో పండుగ జరుపుకునేలా SCR ఈ ప్రత్యేక సేవలను ఏర్పాటు చేసిందని అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రత్యేక రైళ్లు మార్చి 2025లో వేర్వేరు తేదీల్లో నడుస్తాయి, ఇవి చర్లపల్లి రైల్వే టెర్మినల్, షాలిమార్, సంత్రాగచి, జల్నా, పాట్నా వంటి కీలక మార్గాలను కవర్ చేస్తాయి.
ఈ స్టేషన్లలో హాల్టింగ్
ఈ మార్గాల్లో తెలుగు రాష్ట్రాల్లోని నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, విజయనగరంలో ప్రత్యేక రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం ఉటుంది. అలాగే ఒడిశా భువనేశ్వర్, కటక్, ఖరగ్‌పూర్‌తో సహా ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆగుతారు. జాల్నా పాట్నా మధ్య ప్రయాణించే వారి కోసం, ప్రత్యేక రైళ్లు పర్తూర్, సేలు, మాన్వత్ రోడ్, పర్భాని, పూర్ణా, అకోలా, షెగావ్, బుర్హాన్‌పూర్, ఖాండ్వా, ఇటార్సీ, బక్సర్, అరా తోపాటు అనేక ఇతర ముఖ్యమైన స్టేషన్‌లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ప్రతి ఒక్కటి 2AC, 3AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను కలిగి ఉంటాయి. ఇది అన్ని వర్గాల ప్రయాణికులకు ఈ రైళ్లు ప్రయాణ అనుకూలంగా ఉంటాయి.
Holi special trains : మరో 36 ప్రత్యేక రైళ్లు
36 more special trains : హోలీ స్పెషల్ రైళ్లతో పాటు, పండుగ మరియు రాబోయే వేసవి కాలంలో పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి భారతీయ రైల్వే రాజ్‌కోట్, మహబూబ్‌నగర్ మధ్య 36 ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ప్రత్యేక రైళ్లు లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తాయి, వారి ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా ఇబ్బంది లేకుండా చేస్తాయి.
ప్రపంచవ్యాప్తంగా హిందువులు జరుపుకునే ఉత్సాహభరితమైన పండుగ హోలీ.. ఈ సంవత్సరం, రంగుల పండుగ మార్చి 14న వస్తుంది, ఇది వసంతకాలం వస్తుంగా ఈ వేడుకలుజరుపుకుంటారు. చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుందీ పండుగ.
హోలీ 2025: తేదీ
Holi 2025: Date హోలీ ప్రతి సంవత్సరం వేర్వేరు తేదీలలో తిథిని బట్టి వస్తుంది, ప్రధానంగా హిందూ చాంద్ర మాన క్యాలెండర్ ప్రకారం నిర్ణయించబడుతుంది. ఈ సంవత్సరం, హోలీ పండుగ శుక్రవారం, మార్చి 14, 2025న జరుపుకుంటారు, హోలీకి ముందు రోజు, హోలికా దహన్ లేదా చోటి హోలీ అని పిలుస్తారు, మార్చి 13 గురువారం జరుపుకుంటారు. వసంతకాలం రాకను ఆస్వాదించడానికి, శీతాకాలానికి వీడ్కోలు పలుకుతూ ఈ పండును జరుపుకుంటారు. ఈవేడుకల్లో భాగంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ
సంబరాలు చేసుకుంటారు.
Holi special trains Time Table
రైలు నెంబర్ | రైలు మార్గం | ప్రయాణ తేదీలు | Departure | Arrival |
7703 | Charlapalli – Shalimar | 09.03.25 (Sun), 16.03.25 (Sun) | 7:45 PM | 02:00 (2nd day) |
7704 | Shalimar – Charlapalli | 11.03.25 (Mon), 18.03.25 (Mon) | 5:00 AM | 14:50 (next day) |
7705 | Charlapalli – Santragachi | 07.03.25 (Fri), 14.03.25 (Fri) | 7:15 AM | 10:30 (next day) |
7706 | Santragachi – Charlapalli | 08.03.25 (Sat), 15.03.25 (Sat) | 12:35 PM | 16:40 (next day) |
7611 | Jalna – Patna | 06.03.25 (Thu), 13.03.25 (Thu) | 10:00 PM | 09:45 (2nd day) |
7612 | Patna – Jalna | 08.03.25 (Sat), 12.03.25 (Tue), 17.03.25 (Sun) | 3:45 PM | 02:35 (2nd day) |
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.