Karimnagar New Railway Line | కరీంనగర్ – హన్మకొండ జిల్లాలను కలుపుతూ కొత్త రైల్వే లేన్
హసన్ పర్తి రోడ్ స్టేషన్ కరీంనగర్ మధ్య రైల్వేలైన్ నిర్మాణంపై కదలిక
Karimnagar - Hasanparthy Railway Line | కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలను కలుపుతూ రెండో రైల్వే లైన్ నిర్మాణంపై కదలిక వచ్చింది. హనుమకొండ జిల్లా పరిధిలోని లోని హసన్‌పర్తి రోడ్డు రైల్వే స్టేషన్ నుంచి కరీంనగర్ రైల్వే స్టేషన్ మధ్య రైల్వేలైన్ కోసం రెండు జిల్లాల వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ రైలు మార్గంపై ఎట్టకేలకు ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గత మంగళవారం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు. కరీంనగర్ రైల్వే లైన్ ఆవశ్యకతను వివరించడమే కాకుండా పనులను త్వరగా చేపట్టాలని కోరారు. దీనికి రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించారువరంగల్ నుంచి కరీంనగర్‌కు వెళ్లేందుకు ప్రస్తతుం రోడ్డు మార్గమే శరణ్యం. నిత్యం వందలాది ఆర్టీసీ బస్స...