
Tirupathi New Bus Terminal | కలియుగ దైవం తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం తిరుపతిలో అకల సౌకర్యాలతో భారీ బస్టాండ్ కాంప్లెక్స్ అందుబాటులో రాబోతోంది. ఒకేచోట అన్నీ సౌకర్యాలు లభించేలా ప్రస్తుత బస్టాండ్ స్థానంలోనే అత్యాధునిక అల్ట్రా మోడల్ బస్ టెర్మినల్ నిర్మించేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. సుమారు రూ.500 కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. ఇందులో బస్టాండ్‌తో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు ఇలా అన్ని వసతులు ఉండనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్థలాన్ని ఇవ్వనుండగా కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ కొంత పెట్టుబడి పెట్టనుంది. ప్రైవేటు సంస్థ ద్వారా మిగిలిన నిధులను సమకూరుస్తారు. తిరుమల వేంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని ప్రతిబింబించేలా దీని డిజైన్ ను రూపొందించారు. తిరుపతి బస్టాండ్ ప్రస్తుతం 13.18 ఎకరాల్లో విస్తరించి ఉంది.
12.19 ఎకరాల్లో కొత్త టెర్మినల్
కొత్త టెర్మినల్(Tirupathi New Bus Terminal) ను 12.19 ఎకరాల్లో నిర్మిస్తారు. ప్రస్తుత బస్టాండ్‌కు మూడు వైపులా రోడ్లు ఉండగా, కొత్త టెర్మినల్‌కు నాలుగు వైపులా రోడ్లు ఉంటాయి. అంతేకాకుండా రెండు అంతస్తుల్లో సెల్లార్ నిర్మించేలా డిజైన్ చేశారు. ఈ సెల్లార్‌ను ద్విచక్రవహనాలు, కార్ల పార్కింగ్ కోసం ఉపయోగిస్తారు.
ఇక గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం బస్టాండ్ కోసం వినియోగించనున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం 98 ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి. అంతేకాదు, 50 బస్సులు పార్కింగ్ చేయడానికి, ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ పాయింట్ కూడా ఉంటుంది. మొదటి, రెండో అంతస్తుల్లో కొంత భాగాన్ని ఆర్టీసీ కార్యాలయాలకు ఇస్తారు. మిగిలిన స్థలంలో ఫుడ్ కోర్టులు, వివిధ రకాల షాపులు ఉంటాయి. మూడో అంతస్తును సర్వీసుల కోసం కేటాయించనున్నారు. నాలుగు నుంచి ఏడో అంతస్తు వరకు హోటళ్లు, రెస్టారెంట్లు, డార్మెటరీలు, ఇతర వ్యాపార, వాణిజ్య అవసరాలకు వినియోగిస్తారు. 8 , 9 , 10వ అంతస్తుల్లో బ్యాంకులు, ప్రభుత్వ లేదా ప్రైవేటు సంస్థల కార్యాలయాలకోసం కేటాయిస్తారు. పదో అంతస్తుపైన హెలిప్యాడ్ నిర్మిస్తారు. మొత్తం మీద 1.54 లక్షల చదరపు అడుగుల మేర భవనాలను నిర్మించనున్నారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.