Home Andhrapradesh TTD Latest News | రేపు తిరుమల ఆలయం మూసివేత.. అన్ని దర్శనాలు రద్దు –...

TTD Latest News | రేపు తిరుమల ఆలయం మూసివేత.. అన్ని దర్శనాలు రద్దు – 83,122 మంది భక్తుల రద్దీ మధ్య కీలక నిర్ణయం

0
13
Tirumala Tickets Booking
TTD News
Spread the love

భక్తులకు ముఖ్య గమనిక.. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా రేపు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పూర్తిగా మూసివేస్తున్నారు. అన్ని రకాల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.

TTD Latest News : సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా రేపు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానం తలుపులను మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయాన్ని పూర్తిగా మూసివేయనున్నారు.

రద్దైన దర్శనాలు

  • వీఐపీ బ్రేక్ దర్శనాలు
  • ఆర్జిత సేవలు
  • ప్రత్యేక ప్రవేశ దర్శనాలు
  • సర్వదర్శనం టోకెన్లు (తిరుపతిలో జారీచేసేవి)

సోమవారం రాత్రి వరకు మాత్రమే భక్తులను క్యూలైన్లలోకి అనుమతిస్తారు. రేపు జరగాల్సిన అన్ని సేవలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. గ్రహణం ముగిసిన అనంతరం ఆలయ శుద్ధి, సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించి రాత్రి 7.30 గంటల తర్వాతే భక్తులను తిరిగి దర్శనానికి అనుమతించనున్నారు. భక్తులు రేపటి దర్శనాలకు సంబంధించి ముందస్తుగా ప్రణాళికలు మార్చుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుతోంది

TTD News : ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి. క్యూలైన్లు వెలుపల వరకూ సాగుతున్నాయి. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనం పొందడానికి సుమారు 12 గంటల సమయం పడుతోంది నిన్న ఒక్కరోజే 83,122 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు 30,054 మంది తలనీలాలు సమర్పించారు

యాదాద్రి ఆలయం కూడా మూసివేత

సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంను కూడా మంగళవారం మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో భవానీశంకర్ తెలిపారు. ఉదయం 7 గంటలలోపు సుప్రభాత, నిజాభిషేకం, అర్చనలు పూర్తి అనంతరం ఆలయ తలుపులు మూసివేయనున్నారు. 4వ తేదీ ఉదయం 3 నుంచి 5.30 గంటల వరకు గ్రహణ దోష పరిహారార్థం సంప్రోక్షణ, ఆలయ శుద్ధి చేసిన అనంతరం ఉదయం 8.45 గంటలకు దర్శనాలు పునఃప్రారంభమవుతాయి. చంద్రగ్రహణం సందర్భంగా జరగాల్సిన హోలికోత్సవాన్ని ముందురోజే నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.


🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here