Home Telangana తెలుగు రాష్ట్రాలకు ఊరట: రానున్న మూడు రోజులు వర్షాలు.. భానుడి వేడి నుంచి ఉపశమనం!

తెలుగు రాష్ట్రాలకు ఊరట: రానున్న మూడు రోజులు వర్షాలు.. భానుడి వేడి నుంచి ఉపశమనం!

0
65
Rain Alert
TG Weather Report
Spread the love

Rain Alert | భ‌గ‌భ‌గ‌లాల‌డే ఎండ‌ల‌తో త‌ల్ల‌డిల్లిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్‌ చెప్పింది. కర్ణాటక నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వాతావరణ మార్పుల వల్ల గత కొన్ని రోజులుగా నమోదవుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గి వాతావరణం చల్లబడే అవకాశం ఉందని తెలిపింది.

తెలంగాణ‌లో ఈ జిల్లాల‌కు రెయిన్ అల‌ర్ట్‌

ఉమ్మడి మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి, నల్లొండ, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అకాలవర్షాల నేపథ్యంలో ఉరుములు సంభవించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆర‌బ‌య‌ట‌ బయట తిరగవద్దని అధికారులు హెచ్చ‌రించారు.

ఆంధ్రప్రదేశ్‌లో కూడా దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే చాన్స్‌ ఉంది. తీర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

రైతులకు కీలక సూచనలు

అకాల వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు.

  1. కోతకు వచ్చిన పంటలను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
  2. కల్లాల్లో ఉన్న ధాన్యం తడవకుండా టార్పాలిన్ పట్టాలతో ముందస్తు చర్యలు చేపట్టాలి.
  3. ఉరుములు, మెరుపుల సమయంలో పశువులను బయట కట్టేయకూడదు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here