Friday, July 4Welcome to Vandebhaarath

Tag: Rain Alert

మరో రెండు రోజుల పాటు ఈదురుగాలులతో వర్షాలు
Telangana

మరో రెండు రోజుల పాటు ఈదురుగాలులతో వర్షాలు

Rain Report | హైదరాబాద్‌ : ‌తెలంగాణలో మరో రెండు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. వాతావరణ పరిస్థితులపై ఈరోజు కీలక అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఏప్రిల్‌ 10 నుంచి 12వ తేదీ వరకు దక్షిణ భారతదేశంలోని పలు రాష్టాల్ల్రో వర్షాలు కురిసే ఛాన్స్ న్నట్లు తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల. వేగంతో గాలులు వీస్తాయని, పలు ప్రాంతాల్లో పిడుగుపాటు సంభవించే ప్రమాదం కూడా ఉందని వాతావరణ విభాగం హెచ్చరించింది.ఈ వర్ష సూచనల(Rain Report ) ప్రభావం ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) లోని కోస్తాంధ్ర, యానాం, తెలంగాణ, కేరళ, మాహే, కర్ణాటక రాష్ట్రాల్లో కనిపించనున్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. సముద్ర తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు, పిడుగుపాట్ల ప్రభావం ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇక గుజరాత్‌, ‌రాజస్థాన్‌ ‌రాష్ట్రాల్లో వడగాలులు కొనసాగుతాయని ఐఎండీ అంచనా వేసి...
Rain Alert | ఎండల నుంచి ఉపశమనం మూడురోజులపాటు భారీ వర్షాలు
Telangana

Rain Alert | ఎండల నుంచి ఉపశమనం మూడురోజులపాటు భారీ వర్షాలు

TG Weather Report Rain Alert : కొన్నాళ్లుగా తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వానలు, తుఫాను సంభవించే చాన్స్ ఉందని హెచ్చరించింది.హైదరాబాద్‌లో ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు వాతావరణం పూర్తిగా మారిపోతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక మిగిలిన జిల్లాల్లో ఉరుములు, బలమైన ఈదురు గాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కరుస్తాయని వెల్లడించింది.TG Rain Alertనేటి (గురువారం మార్చి 20) వాతావరణం గమనిస్తే.. ఉదయం నుంచి ఎండలు దంచేస్తాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎండ ఎక్కువగానే ఉంటుంది.IMD HyderabadRain Alert మార్చి 22, 23, 24వ తేదీల్లో సెంట్రల్ నార్త్ తెలంగాణ నుంచి దక్షిణ తెలంగాణ...
Rain Alert | రాష్ట్రానికి నాలుగు రోజులు వ‌ర్షాలు !
Andhrapradesh, Telangana

Rain Alert | రాష్ట్రానికి నాలుగు రోజులు వ‌ర్షాలు !

Hyderabad Rain Alert | రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఉత్తర తమిళనాడు తీరప్రాంతాన్ని ఆనుకొని ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతుందని తెలిపింది. .మరో ఆవర్తనం అండమాన్‌ సముద్రంలో సముద్ర మట్టానికి రూ.5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉందని పేర్కొంది. సోమవారం నాటికి అల్పపీడనంగా బలపడే చాన్స్ ఉందని.. ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణిస్తూ 23న వాయు గుండంగా తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని తెలిపింది.ఇక ఆదివారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, వరంగల్‌, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిసే చాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. , సోమ, మంగళవారాల్లోనూ పలు జిల్లా...
TG Rain Alert | తెలంగాణలోని మరో రెండు రోజులు అతిభారీ వర్షాలు..!
Telangana

TG Rain Alert | తెలంగాణలోని మరో రెండు రోజులు అతిభారీ వర్షాలు..!

TG Rain Alert | తెలంగాణలో వ‌చ్చే మూడు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ క్ర‌మంలో ప‌లు జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతున్న‌దని, ఒడిశా పూరీకి తూర్పు ఆగ్నేయ దిశలో 50 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని పేర్కొంది. ఇది ఒడిశా వ‌ద్ద‌ తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశా మీదుగా వెళ్తూ అదే తీవ్రతతో సోమవారం అర్ధరాత్రి వరకు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ కేంద్రం చెప్పింది. రాబోయే 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా వెళ్లే చాన్స్‌ ఉందని అంచనా వేసింది.ఈ క్రమంలో మంగళవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ కేంద్రం చెప్పింది. అలాగే బుధవారం ఆదిలాబ...
Telangana Rains | నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌ జారీ
Telangana

Telangana Rains | నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌ జారీ

Telangana Rains | తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే చాన్స్ ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం వరకు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవ‌కావం ఉందని వెల్ల‌డించింది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తాయని తెలిపింది.మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మానుకోట, వరంగల్‌, హన్మకొండ, జనగామ‌, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరిలో వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని తెలిపింది. ఇక బుధ, గురువారాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వ‌ర్షాలు పడే చాన్స్ ఉన్నాయ‌ని తెలిపింది....
Rain Report | తెలంగాణను వీడని ముసురు.. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ..
Telangana

Rain Report | తెలంగాణను వీడని ముసురు.. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ..

Rain Report | వరుస వానలు రాష్ట్రాన్ని వీడడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రోజంతా ముసురు కమ్ముకుంటుండడంతో ప్రజలు ఇండ్లను విడిచి బయటకు రావడం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మరోసారి  వానలకు సంబంధించి అప్రమత్తం చేసింది. మరో నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిచింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా  వర్షాలు కురుస్తాయని  వెల్లడించింది.Rain Report In Telangana : భారీ వర్షాలు ముఖ్యంగా  నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మెదక్‌లో ఈదురుగాలలతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌తో పాటు జగిత్యాల, మెదక్‌, సిరిసిల్ల, సిద్దిపేట, కరీ...
Rainfall | తెలంగాణలో నేటి నుంచి భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన వాతావ‌ర‌ణ కేంద్రం
Telangana

Rainfall | తెలంగాణలో నేటి నుంచి భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్‌ జారీ చేసిన వాతావ‌ర‌ణ కేంద్రం

Rainfall | హైదరాబాద్: తెలంగాణ లో జూలై 12 నుంచి 15 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చ‌రించారు. రాష్ట్రంలో ప‌లుజిల్లాల్లో స‌రైన వ‌ర్షాలు కుర‌వ‌క‌పోవ‌డంతో క‌రువు ప‌రిస్థితులు వ‌స్త‌యేమోన‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్నారు.ఈ క్ర‌మంలోనే వాతావ‌ర‌ణ కేంద్రం వ‌ర్షాల‌కు సంబంధించి కీల‌క అప్‌డేట్ ఇచ్చింది. శుక్ర‌వారం నుంచి వ‌రుస‌గా మూడు రోజుల‌పాటు వ‌ర్షాలు కుర‌వ‌నున్నాయ‌ని తెలిపింది. ఈమేర‌కు భారత వాతావరణ శాఖ (IMD) అనేక జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది, ప్ర‌జ‌లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.హైదరాబాద్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. తెలంగాణ ప్లానింగ్ డెవలప్‌మెంట్ అండ్ సొసైటీ డేటా ప్రకారం, రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి హైద‌రాబాద్ ప‌రిధిలో 174.6 మిమీ వర్షపాతం నమోదైంది. ఇక్క‌డ‌ సాధారణ పరిధి 154 ...
Heavy Rains | తెలంగాణలో ప‌లు జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌.. ఇక‌ ఐదురోజులు వర్షాలే..
Telangana

Heavy Rains | తెలంగాణలో ప‌లు జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌.. ఇక‌ ఐదురోజులు వర్షాలే..

Telangana Heavy Rains | తెలంగాణలో రానున్న‌ ఐదు రోజుల పాటు తేలిక పాటి నుంచి మోస్త‌రు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. గురువారం నుంచి శనివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాన‌లు కురుస్తాయని తెలిపింది. ఆదివారం, సోమవారాల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడ‌నున్నాయ‌నిపేర్కొంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప‌లు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. ఆదివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్ల‌గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్‌, వనపర్తి జిల్లాల్లో ప‌లుచోట్ల వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చ‌రించింది.ఇక‌ సోమవారం మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, వరంగల్‌, భూపాల‌ప‌ల్లి, ములుగు, మహబూబాబాద్‌, జనగామ‌ జిల్లాలో భారీ వ‌ర్షాలు (Heavy Rains)  కురుస్తాయని...
Weather Updates : ఏపీలో ఐదు రోజుల‌పాటు ఉరుములు, ఈదురు గాలుల‌తో భారీ వ‌ర్షాలు..
Andhrapradesh

Weather Updates : ఏపీలో ఐదు రోజుల‌పాటు ఉరుములు, ఈదురు గాలుల‌తో భారీ వ‌ర్షాలు..

AP Weather Updates : ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో జూన్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు మెరుపులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) శనివారం తెలిపింది. జూన్ 15, 2024 శనివారం ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌, రాయలసీమ అంతటా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.Weather Updates రానున్న ఐదు రోజుల పాటు ఈ ప్రాంతాల్లో గంటకు 40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రానున్న నాలుగైదు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్ర ప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోకి మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వాయువ్య బంగాళాఖాతం, గంగానది పశ్చిమ బెంగాల్ ప్రాంతాలు, ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్‌లోని మిగిలిన ప్రాంతాలు బీహార్...
Rainfall | తెలంగాణ‌లో మూడు రోజులు వ‌ర్షాలు.. హైద‌రాబాద్ కు ఎల్లో అల‌ర్ట్‌..
Telangana

Rainfall | తెలంగాణ‌లో మూడు రోజులు వ‌ర్షాలు.. హైద‌రాబాద్ కు ఎల్లో అల‌ర్ట్‌..

Rainfall : తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున హైదరాబాద్‌లోని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఐఎండీ హైదరాబాద్ అన్ని జోన్లలో వర్షపాతం నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుప‌వ‌నాలు విస్త‌రించాయి. సోమ‌వారం ఉత్త‌ర అరేబియా స‌ముద్రం, మ‌హారాష్ట్ర‌లోని ప‌లు ప్రాంతాల్లో రుతు ప‌వ‌నాలు విస్త‌రించ‌నున్నాయి. నాసిక్, నిజామాబాద్, సుకుమా, విజ‌య‌న‌గ‌రం, ఇస్లాంపూర్ వ‌ర‌కు రుతుప‌వ‌నాలు వ్యాపించాయి.నైరుతి రుతుప‌వనాల వ్యాప్తితో తెలంగాణ‌లో రాగ‌ల‌ మూడు రోజులు ఉరుములు, మెరుపుల‌తో కూడిన వ‌ర్షాలు కురిసే అవ‌కాశాలున్నాయ‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం ప్ర‌క‌టించింది. గంట‌కు 30 నుంచి 40 కిలోమీట‌ర్ల వేగంతో కూడిన ఈదురు గాలుల‌తో వాన‌లు కురిసే అవ‌కాశం ఉంది.హైదరాబాద్ నగరంలో (Hyderabad Rainfall )  జూన్ 13 వరకు వర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ కేంద్రం తెలిపింది. అదనంగా, తెలం...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..