Rain Report | తెలంగాణను వీడని ముసురు.. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ..

Rain Report | తెలంగాణను వీడని ముసురు.. మరో నాలుగు రోజులు భారీ వర్షాలు.. రెడ్ అలెర్ట్ జారీ..
Spread the love

Rain Report | వరుస వానలు రాష్ట్రాన్ని వీడడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వారం రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రోజంతా ముసురు కమ్ముకుంటుండడంతో ప్రజలు ఇండ్లను విడిచి బయటకు రావడం లేదు. ఈ క్రమంలో హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మరోసారి  వానలకు సంబంధించి అప్రమత్తం చేసింది. మరో నాలుగు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరిచింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కుండపోతగా  వర్షాలు కురుస్తాయని  వెల్లడించింది.

READ MORE  తెలంగాణ రోడ్ల‌పై కొత్త‌గా సెమీ డీలక్స్, మెట్రో డీలక్స్ బ‌స్సులు.. ఇక మహిళలూ టికెట్‌ కొనాల్సిందే..

Rain Report In Telangana : భారీ వర్షాలు ముఖ్యంగా  నిజామాబాద్‌, కామారెడ్డి, ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మెదక్‌లో ఈదురుగాలలతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఇక హైదరాబాద్‌తో పాటు జగిత్యాల, మెదక్‌, సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్‌, హనుమకొండ, వరంగల్‌, జనగామ, డమహబూబాబాద్‌, నాగర్‌కర్నూలు, వనపర్తి జిల్లాలకు ఎల్లోఅలర్ట్‌ జారీ చేసింది. కాగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ  హెచ్చరించింది. గత  24 గంటల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా చింతలమానేపల్లిలో అత్యధికంగా 5.76 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది.

READ MORE  Rythu Runa-Mafi Guidelines | రైతులకు శుభ‌వార్త‌.. రుణమాఫీ మార్గదర్శకాలు విడుదల.. రేషన్‌ ‌కార్డు ఆధారంగా..

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *