Home Telangana Telangana Rains | నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌ జారీ

Telangana Rains | నాలుగు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్‌ జారీ

0
7
Telangana Rains
TG Rain Alert
Spread the love

Telangana Rains | తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే చాన్స్ ఉంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం వరకు పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, నారాయణపేట, వనపర్తి, గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవ‌కావం ఉందని వెల్ల‌డించింది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వస్తాయని తెలిపింది.

మంగళవారం నుంచి బుధవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మానుకోట, వరంగల్‌, హన్మకొండ, జనగామ‌, సిద్దిపేట, భువనగిరి, హైదరాబాద్‌, మేడ్చల్‌, మల్కాజ్‌గిరిలో వ‌ర్షాలు కురిసే అవకాశం ఉంద‌ని తెలిపింది. ఇక బుధ, గురువారాల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వ‌ర్షాలు పడే చాన్స్ ఉన్నాయ‌ని తెలిపింది.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here