
Rains | రాష్ట్రంలో మూడురోజులు వర్షాలు.. 15 జిల్లాలకు ఎల్లో అలెర్ట్
Rains | వరుణుడు మరోసారి తెలుగు రాష్ట్రాలను పలకరించనున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్‌కు చేరువగా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వెస్ట్ బెంగాల్‌తో పాటుగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో (AP, TG Rains) మరో 4 రోజుల పాటు ఉంటుందని అంచనా వేసింది. రానున్న 4 రోజులు ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని, రాయలసీమ ప్రాంతంలో మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో రాయలసీమ జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.ఇక తెలంగాణ రాష్ట్రంలో లో రానున్న మూడు రోజుల పాటు తేలిక...