Ladakh New Districts | లడఖ్ కేంద్రపాలిత ప్రాంత అభివృద్ధిలో నేడు ఒక చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. లడఖ్ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ, లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఐదు కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సోమవారం ఆమోదించారు.
కొత్తగా ఏర్పాటైన జిల్లాలు (Ladakh New Districts) : ఇప్పటివరకు లడఖ్‌లో లేహ్, కార్గిల్ అనే రెండు జిల్లాలు మాత్రమే ఉండగా, తాజా నిర్ణయంతో జిల్లాల సంఖ్య ఏడుకు చేరింది. కొత్తగా ఏర్పాటైన జిల్లాలు ఇవే:
- నుబ్రా (Nubra)
- షామ్ (Sham)
- చాంగ్‌తాంగ్ (Changthang)
- జాంస్కర్ (Zanskar)
- ద్రాస్ (Drass)
ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా.. ఈ సందర్భంగా ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ.. “లడఖ్ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆశించిన అభివృద్ధి చెందిన, సంపన్న లడఖ్ దిశగా ఇది కీలక అడుగు” అని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) ఆగస్టు 2024లో ఈ ప్రతిపాదనకు ప్రాథమిక ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే.
పరిపాలన మరింత చేరువగా.. కొత్త జిల్లాల ఏర్పాటు వల్ల మారుమూల ప్రాంతాల్లో పరిపాలన మరింత వేగవంతం కానుంది. అట్టడుగు స్థాయిలో సుపరిపాలన అందించడంతో పాటు, ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిటకే చేరుతాయని ఎల్జీ ధీమా వ్యక్తం చేశారు. అలాగే, ఈ నిర్ణయం వల్ల స్థానికులకు కొత్త ఉపాధి అవకాశాలు, వ్యాపార మార్గాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳










