ఆహ్లాదభరితమైన సమ్మర్ హాలిడే వెకేషన్ కోసం భారతదేశంలోని అత్యుత్తమ పర్యాటక కేంద్రాలు
సమ్మర్ లో దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. . భారతదేశంలోని అనేక ప్రాంతాలలో పగటి ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు పైనే నమోదవుతుండడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.
ఉక్కపోతల నుంచి ఎక్కడికైనా సరదాగా సమ్మర్ హాలిడే వెకేషన్ కోసం చాలా మంది ప్లాన్లు వేసుకుంటున్నారు. మీరు కూడా వారాంతంలో చక్కని వేసవి విడిది కోసం వెతుకుతున్నారా? అయితే భారతదేశంలోని ఐదు అత్యంత ప్రసిద్ధ వేసవి డెస్టినేషన్లను ఒకసారి పరిశీలించండి..
లేహ్, లడఖ్, జమ్మూ & కాశ్మీర్
జమ్మూ, కాశ్మీర్‌లోని లేహ్, లడఖ్ ప్రాంతాలను ఆధ్యాత్మిక పర్వతాలు, దేవతల నివాసాలు అని కూడా పిలుస్తారు. వాటి భూతల స్వర్గంలా ఉంటుందీ ప్రాంతం. స్వచ్ఛమైన గాలి, ఉత్తేజకరమైన ప్రయాణానికి ప్రసిద్ధి చెందాయి. వేసవి వేడి నుండి తప్పించుకోవడానికి మీరు లేహ్, లడఖ్, పహల్గాం, గుల్మార్గ్, శ్రీనగర్ , భదర్వా, వైష్ణో దేవి కొండలు, అమర్‌నాథ్ అనేక ఇతర ఉత్తేజకరమైన ప్రదేశాలను సందర్శించవచ్చు.
మనాలి, హిమాచల్ ప్రదేశ్
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలి శాశ్వతమైన మంచుతో కప్పబడిన శిఖరాలతో అద్భుతంగా ఉంటుంది. తెల్లని మంచు పర్వాతాలను చూస్తే, మనం భారతదేశంలోనే ఉన్నామా అని అనుమానం కలుగక మానదు. మనాలి సాహస ప్రియులను ఆకర్షిస్తే , సిమ్లా రొమాంటిక్ హృదయాలను ఆకట్టుకుంటుంది. మీ హిమాచల్ పర్యటనలో, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో ధర్మశాల శివారు ప్రాంతమైన మెక్‌లియోడ్ గంజ్‌ని కూడా సందర్శించవచ్చు. ధర్మశాల, మెక్లియోడ్ గంజ్ పట్టణాలలో బౌద్ధ తత్వశాస్త్రం, విపస్సనా ధ్యానం గురించి అధ్యయనం చేయవచ్చు.
నైనిటాల్, ఉత్తరాఖండ్
నైనిటాల్ , అందమైన సరస్సుల మధ్య, భారతదేశంలోని హనీమూన్ కోసం అద్భుతమైన గమ్యస్థానం. హిల్ సిటీ మొత్తం నైని సరస్సు చుట్టూ ఉంది. ఇది నైనిటాల్ అద్భుతమైన అందానికి కేంద్రం. నౌకుచియాటల్ వద్ద పక్షిలా ఎగరడానికి వేసవి కాలం ఉత్తమ సమయం. ఈ ప్రదేశం అందమైన ఆకాశాన్ని అన్వేషించడానికి పారాగ్లైడింగ్ కోసం వెళ్లండి.
మావ్లిన్నోంగ్, మేఘాలయ
ఆసియాలో అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా ఖాసీ హిల్స్‌లోని సహజమైన కొండల్లోని మావ్లిన్నాంగ్ గుర్తిపు పొందింది. ఇక్కడ స్థానికులకు ప్రకృతికి మధ్య విడదీయరాన్ని అనుబంధాన్ని ప్రతిబింబిస్తుంది. పరిశుభ్రమైన వీధులు, చక్కగా అలంకరించిన గృహాలు, పచ్చని పొలాలు, లివింగ్ రూట్ బ్రిడ్జ్, రివర్ డాకీ వంటి పర్యాటక ప్రదేశాలు, సందర్శించడానికి అందమైన ప్రదేశాలే కాకుండా, స్థానికుల నుండి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి.
మజులి, అస్సాం
ఆసియాలోని అతిపెద్ద మంచినీటి నదీ ద్వీపాలలో ఒకటైన మజులి బ్రహ్మపుత్రలో ఉంది. స్థిరమైన నేల కోతకు ముప్పు పొంచి ఉంది. ఈ ప్రత్యేకమైన గమ్యస్థానానికి పరిరక్షణ కోసం తక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే వేసవి విడిది కోసం ఇది చక్కని ఆప్షన్.