- బ్రహ్మశ్రీ జ్ఞానచైతన్యానంద స్వామీజీ
- అబ్బనికుంటలో ఆధ్యాత్మిక వెల్లువ..
- ‘గణపతి దేవా హిందూ మహా సమ్మేళనం’ దిగ్విజయం
వరంగల్ నగరంలోని అబ్బనికుంటలో టీఆర్టీ గ్రౌండ్ వేదికగా గురువారం సాయంత్రం ‘గణపతి దేవా హిందూ మహా సమ్మేళనం’ (Hindu Maha Sammelanam) కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆసాంతం ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ సమ్మేళనంలో వివిధ కాలనీల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
హిందూ ఐక్యతే ధ్యేయం: జ్ఞానచైతన్యానంద స్వామీజీ
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పూజ్య బ్రహ్మశ్రీ జ్ఞానచైతన్యానంద స్వామీజీ తన అమూల్యమైన ధర్మ సందేశాన్ని వినిపించారు. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా హిందువులందరూ కులమతాలకు అతీతంగా ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పిలుపునిచ్చారు. ధర్మ రక్షణే దేశ రక్షణ అని ఆయన ఉద్ఘాటించారు.
ముఖ్య వక్తగా పాల్గొన్న ఆర్ఎస్ఎస్ (RSS) తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేష్ మాట్లాడుతూ.. హిందూ సమాజం తన మూలాలను మర్చిపోకుండా సంస్కృతిని కాపాడుకోవాలని సూచించారు. మహిళా వక్తగా పాకాల తనూజ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో మహిళల పాత్రను కొనియాడారు. అనంతరం ఏర్పాటు చేసిన మహా అన్న ప్రసాద వితరణలో స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి గుండేటి దినేష్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

వెయ్యి కుటుంబాలకు భగవద్గీత గ్రంథాల పంపిణీ
హిందూ సమ్మేళనంలో భాగంగా సుమారు వెయ్యి కుటుంబాలకు భగవద్గీత గ్రంథాలను అనుమాసా అశోక్ గారు ఉచితంగా పంపిణీ చేశారు. వారసత్వ సంపదను, సనాతన ధర్మ విలువలను భావి తరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు సమితి అధ్యక్షులు మామీడాల రమేష్ బాబు తెలిపారు.
ఈ సమ్మేళనంలో గణపతి దేవా హిందూ మహా సమ్మేళనం సమితి అధ్యక్షులు మామిడాల రమేష్ బాబు, గౌరవ అధ్యక్షులు కొండ సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి దామరాజు బాలకృష్ణ, శివశ్రీ బోగీశ్వర శాస్త్రి, జోగు చంద్రశేఖర్, కుందారపు రాజేందర్, కొంతం విద్యాసాగర్, బొడ్డు రాకేశ్, మూడేడ్ల సతీష్, కందుల సంపత్, గడ్డమీది రాజేష్, కనుకుంట్ల రంజిత్, సూర శ్రీను, ఆమంచ సుకుమార్, ఆమంచ జ్ఞానేశ్వర్, గొట్టిముక్కుల మధు, గొట్టిముక్కుల గోపి, చక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే RSS ప్రతినిధులు వరంగల్ విభాగ్ సంఘచాలక్ బందెల మోహనరావు, కార్యవాహ గద్దె రమేష్, వరంగల్ మహానగర్ కార్యవాహ బుదారపు పృథ్వి, సహ కార్యవాహ వెలిషోజు వీరలింగం, కాశిబుగ్గ నగర్ సంఘచాలక్ చామర్తి ప్రభాకర్, కార్యవాహ తౌటం తిరుమల్ హాజరయ్యారు.
🚩 వరంగల్లో ఆధ్యాత్మిక శోభ.. దిగ్విజయంగా గణపతి దేవా హిందూ మహా సమ్మేళనం! 🔱
అబ్బనికుంట టీఆర్టీ గ్రౌండ్ లో జరిగిన సమ్మేళనంలో:
✅ పూజ్య బ్రహ్మశ్రీ జ్ఞానచైతన్యానంద స్వామీజీ ధర్మ సందేశం.
✅ హిందూ ఐక్యత కోసం పిలుపునిచ్చిన ఆర్ఎస్ఎస్ నేతలు.
✅ అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు.. ముగిసిన… pic.twitter.com/RCKaf1zz6b— Vande Bhaarath 🚩 (@Vandebhaarath1) May 15, 2026
🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳










