Home Telangana IMD Report | రానున్న‌ ఐదురోజుల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ...

IMD Report | రానున్న‌ ఐదురోజుల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ ..

0
4
Rain Alert
TG Weather Report
Spread the love

IMD Report  | తెలంగాణలో రానున్న‌ ఐదు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరశాఖ హెచ్చరించింది. ఈ మేర‌కు ప‌లు జిల్లాలకు ఆరెంజ్‌, ‌ఎల్లో అలెర్ట్‌ల‌ను జారీ చేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో విస్తరించింద‌ని, వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే చాన్స్ ఉంద‌ని వెల్ల‌డించింది. ఈ అల్పపీడనం రెండు రోజుల పాటు పశ్చిమ, వాయువ్యం దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు చేర‌నున్న‌ట్లు అంచనా వేసింది. ఈ క్రమంలో తెలంగాణలో ఐదురోజులు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది

IMD Report  శుక్రవారం ఆదిలాబాద్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, ‌జగిత్యాల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. నిజామాబాద్‌, ‌నిర్మల్‌, ‌సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్‌, ‌భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, ‌భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, ‌హన్మకొండ, హైదరాబాద్‌, ‌మేడ్చల్‌ ‌మల్కాజ్‌గిరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవ‌కాశం ఉంద‌ని వెల్ల‌డించింది. అలాగే శనివారం జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, ‌వరంగల్‌, ‌హన్మకొండ, కొత్తగూడెం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురిసే చాన్స్‌ ఉందని పేర్కొంది.ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్‌, ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది.


న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here