Home Telangana Rain Alert రాష్ట్రంలో మరో ఐదురోజులు వానలే వానలు..!

Rain Alert రాష్ట్రంలో మరో ఐదురోజులు వానలే వానలు..!

0
10
Rain Alert
IMD Hyderabad
Spread the love

Telangana Rain Alert | కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. రానున్న ఐదురోజుల పాటు రాష్ట్ర‌ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరిక‌లు జారీ చేసింది.
సోమ‌వారం ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్‌, సంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో సోమ‌వారం అక్కడక్కడా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించంది.

ఇక మంగళవారం ఆదిలాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, హన్మకొండ, జనగామ‌, సిద్దిపేట, భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చ‌రిస్తూ ఎల్లో అలెర్ట్ ను జారీ చేసింది. కాగా గ‌త 24 గంటల్లో పలు జిల్లాల్లో భారీగా వాన‌లు ప‌డ్డాయి. అత్యధికంగా సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో 7.5 సెంటీమీటర్ల వ‌ర్ష‌పాతం న‌మోదు కాగా, సిద్దిపేట అర్బన్‌లో 6.5 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైన‌ట్లు అధికారులు తెలిపారు.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here