TG Weather Report | వ‌చ్చే ఐదురోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన‌ ఐఎండీ

TG Weather Report | వ‌చ్చే ఐదురోజులు భారీ వర్షాలు..! ఈ జిల్లాల‌కు ఎల్లో అలెర్ట్ జారీ చేసిన‌ ఐఎండీ
Spread the love

TG Weather Report | తెలంగాణలో రానున్న ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు ప‌డే అవ‌కాశాలు ఉన్నాయ‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ప‌లు జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది ఐఎండి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెం, నల్ల‌గొండ, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, భూపాల‌ప‌ల్లి, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైద‌రాబాద్‌ వాతావ‌ర‌ణ కేంద్రం వెల్ల‌డించింది.

ఇక నిజామాబాద్‌, కామారెడ్డి , కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జ‌యశంక‌ర్‌ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, కొత్తగూడెం, నల్ల‌గొండ, సూర్యాపేట, వరంగల్‌, హన్మకొండ, జనగామ‌, మహబూబాబాద్‌, మెదక్‌, సిద్దిపేట, భువనగిరి, సంగారెడ్డి, జిల్లాలో బుధవారం నుంచి గురువారం వరకు వర్షాలు పడుతాయని పేర్కొంది. అలాగే గురువారం నుంచి శుక్రవారం వరకు ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జ‌య‌శంకర్‌ భూపాలపల్లి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయ‌ని తెలిపింది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..  అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *