TG Rain Alert | వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం శుక్రవారం వాయుగుండంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఒడిశా, ఉత్తరాంధ తీరానికి సమీపంలో ఒడిశాలోని పూరీకి ఆగ్నేయంగా 70 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నం తూర్పు-ఈశాన్యంగా 240 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. వాతావరణ కేంద్రం ప్రకారం.. శనివారం తెల్లవారుజామున వాయువ్యదిశగా ప్రయాణించి.. పూరీ సమయంలో ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది. ఆ తర్వాత ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ 24గంటల్లో బలహీనపడుతుందని తెలిపింది.
ఈ క్రమంలో రానున్న రెండురోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది.
IMD TG Rain Alert : కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, ఖమ్మం, వరంగల్, హనుమకొండ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్, నిజామాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల, నల్లగొడ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలెర్ట్ ను ప్రకటించింది. అలాగే శనివారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది దీంతో ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్… ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో కొన్ని చోట్ల భారీగా వానలు కురిసే చాన్స్ ఉందని తెలిపిందీ ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్‌ను ప్రకటించింది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..