Sunday, October 13Latest Telugu News
Shadow

Tag: Telugu news

Hyderabad | రాష్ట్రంలో ప‌త‌న‌మ‌వుతున్న‌ రియ‌ల్ ఎస్టేట్..

Hyderabad | రాష్ట్రంలో ప‌త‌న‌మ‌వుతున్న‌ రియ‌ల్ ఎస్టేట్..

Telangana
Hyderabad | రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం (Real Estate)  నష్టాల్లో కూరుకుపోతోంది. ఆస్తుల‌ను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ముందుకు రావ‌డంలేదు. బిల్డర్లు, డెవలపర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలను చేప‌ట్ట‌డంలేదు. తాజాగా కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CREDAI ) తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించాల్సిన అనేక సమస్యలను నివేదించింది. ఆగస్టులో కొన్ని సూచనలు చేసింది, అయినప్పటికీ ఎటువంటి పురోగతి లేదని క్రెడాయ్ పేర్కొంది. జిల్లాల్లో లేఅవుట్‌లకు అనుమతులు మంజూరు చేయడంలో విపరీతమైన జాప్యంపై రియల్ ఎస్టేట్ వ‌ర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి , రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరైన కార్యక్రమంలో అనేక ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. జిల్లాల్లో అనుమతుల మంజూరులో జా...
TATA Motors | టాటా వాహనాలు ఎందుకు దృఢంగా ఉన్నాయి? కారణాలు ఇవే..!

TATA Motors | టాటా వాహనాలు ఎందుకు దృఢంగా ఉన్నాయి? కారణాలు ఇవే..!

Automobile
TATA Motors | పెట్రోల్, సిఎన్‌జి, ఎలక్ట్రిక్ సెగ్మెంట్లలో రతన్ టాటా కంపెనీ టాటా మోటార్స్ ఆధిపత్యం చెలాయిస్తోంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా మోటార్స్ కు చెందిన చాలా వాహనాలు ఫైవ్ స్టార్ రేటింగ్‌లను పొందాయి. అయితే టాటా తన వాహనాలన్నింటిని ఇంత పటిష్టంగా ఎలా తయారు చేసింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? టాటా మోటార్స్ వాహనాలు ఎందుకు చాలా సురక్షితమైనవి, వాటిపై న‌మ్మ‌కాన్ని పెంచేందుకు టాటా కంపెనీ ఏమి చేస్తుందో మాకు తెలుసా? అధిక నాణ్యత కలిగిన స్టీల్ టాటా మోటార్స్ వాహనాలను తయారు చేసేటప్పుడు నాణ్యత విషయంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాజీపడదు, ఈ కంపెనీ ఎల్లప్పుడూ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుంటుంది. త‌క్కువ ధ‌ర క‌లిగిన వాహనాల్లో కూడా కంపెనీ అధిక దృఢ‌మైన‌ స్టీల్‌ను వాడడానికి ఇదే కారణం. ఇది కారు నిర్మాణాన్ని బలపరుస్తుంది. ఒక భవనానికి బ‌ల‌మైన‌ పునాది ఎంత బలంగా చేకూరుస్తుందో.. అలాగే వాహనం కూడా దృఢంగ...
Skill University Admission | స్కిల్ యూనివ‌ర్సిటీలో అడ్మిషన్స్ షురూ..

Skill University Admission | స్కిల్ యూనివ‌ర్సిటీలో అడ్మిషన్స్ షురూ..

Career
Skill University Admission | తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (Skill University) అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ  దసరా పండుగ నుంచే స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇటీవలే అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలోనే స్కిల్ యూనివర్సిటీలో కొన్ని కోర్సులలో ప్రవేశాల కోసం  నోటిఫికేషన్ జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.మొదటి విడతగా యూనివర్సిటీ మూడు స్కూల్స్‌ను, వాటిల్లో నాలుగు కోర్సులను ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, హెల్త్ కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్‌ను ఈ ఏడాది నుంచే ప్రారంభించనున్నారు. వీటిల్లో లాజిస్టిక్స్ అండ్ ఈ -కామర్స్ స్కూల్ కింద వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్సయినర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు, హెల్త్‌కేర్‌లో భాగంగా ఫినిషింగ్ స...
TCS in Vizag : విశాఖలో టీసీఎస్ ద్వారా యువతకు 10 వేల ఉద్యోగాలు

TCS in Vizag : విశాఖలో టీసీఎస్ ద్వారా యువతకు 10 వేల ఉద్యోగాలు

Andhrapradesh
TCS to open its office in Visakhapatnam | విశాఖ సాగ‌ర‌తీరంలో టాటా క‌న్సల్టెన్సీ స‌ర్వీస్ ( TCS in Vizag) 10వేల మంది యువ‌త‌కు మెరుగైన జీత‌భ‌త్యాలతో ఉద్యోగాలు ల‌భించ‌నున్నాయి. యువ‌నేత నారా లోకేష్ (Nara Lokesh) గ‌తంలో ఇచ్చిన మాట ప్ర‌కారం.. ఏపీకి ప్రఖ్యాత ఐటీ కంపెనీలు ర‌ప్పించి యువ‌త‌కు ఉద్యోగాలిప్పిస్తాన‌ని ఇచ్చిన మాట నెర‌వేర్చే దిశ‌గా య‌త్నాలను ముమ్మ‌రం చేశారు. ఈమేర‌కు తాజాగా టాటా గ్రూపు చైర్మన్‌, సంస్థ ప్ర‌తినిధుల‌ను ఒప్పించి విశాఖ‌కు టీసీఎస్ ని తీసుకొచ్చారు. ముంబై మ‌హాన‌గ‌రంలోని టాటా స‌న్స్ ఆఫీస్ బాంబే హౌస్ లో టాటా స‌న్స్ చైర్మన్ ఎం.చంద్రశేఖ‌ర‌న్‌తో మంగ‌ళ‌వారం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ఐటీ, ఎల‌క్ట్రానిక్స్, మాన‌వ‌వ‌న‌రుల శాఖ మంత్రి నారా లోకేష్ స‌మావేశ‌మ‌య్యారు. ఈ భేటీలో సీఎంవో అడిష‌నల్ సెక్రట‌రీ కార్తికేయ మిశ్రా, టాటా గ్రూప్ అధికారులు హాజ‌ర‌య్యారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వం క‌ల్పిస్తున్న సౌక‌ర్యాలు,...
PMGKAY | 2028 డిసెంబర్‌ వరకు ఉచిత బియ్యం.. కేంద్ర కేబినెట్‌ ఆమోదం

PMGKAY | 2028 డిసెంబర్‌ వరకు ఉచిత బియ్యం.. కేంద్ర కేబినెట్‌ ఆమోదం

Breaking News
PMGKAY | దేశవ్యాప్తంగా ఆహార భద్రతలో భాగంగా ఉచితంగా బియ్యం/ఆహారధాన్యాలు అందించేందుకు కేంద్రం ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన (PMGKAY)తోపాటు ఇత‌ర‌ పథకాలను కేంద్రం మ‌రోసారి పొడిగించింది. 2028 డిసెంబర్‌ వరకు ఉచిత బియ్యం పంపిణీ పథకాలకు కేంద్ర మంత్రి వ‌ర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ ప‌థ‌కాల‌ కోసం రూ. 17,082 కోట్లు వెచ్చించ‌నున్న‌ట్లు కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం తెలిపింది. రాబోయే పండగల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని కేంద్ర మంత్రివర్గం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ ఇచ్చిన హామీ మేర‌కు కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. లక్ష్యిత ప్రజాపంపిణీ వ్యవస్థ (TPDS), ఇతర సంక్షేమ పథకాలు, సమగ్ర శిశు అభివృద్ధి సేవ (ICDS) అంతటా బలవర్థకమైన బియ్యం సరఫరా, దేశంలో రక్తహీనత, సూక్ష్మపోషకాల లోపాలను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత...
Group 1 Mains Hall Tickets | ఈనెల 14 నుంచి గ్రూప్ 1 మెయిన్స్‌ హాల్‌ టికెట్లు..

Group 1 Mains Hall Tickets | ఈనెల 14 నుంచి గ్రూప్ 1 మెయిన్స్‌ హాల్‌ టికెట్లు..

Telangana
Group 1 Mains Hall Tickets | TGPSC  గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు నిర్వ‌హించేందుకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో భాగంగా త్వరలోనే హాల్‌ టికెట్లను విడుదల చేయనున్నట్లు టీజీపీఎస్‌సీ ప్రకటించింది. ఈ నెల 14న టీజీఎస్‌పీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌ టికెట్లు అందుబాటులోకి ఉంచుతామ‌ని, అభ్యర్థులు హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఒక‌ ప్రకటనలో పేర్కొంది.ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు కొనసాగనున్నాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష హాల్‌లోకి మధ్యాహ్నం 12.30 గంటల నుంచే అభ్యర్థులను అనుమతించనున్నారు.ఇక గ్రూప్‌-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఈ ఏడాది జూన్‌ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్‌ నిర్వహించగా 3.02లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షలు ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భ...
Hydra: హైడ్రాకు.. అద‌న‌పు బలం.. ఇక నేరుగా రంగంలోకి

Hydra: హైడ్రాకు.. అద‌న‌పు బలం.. ఇక నేరుగా రంగంలోకి

Telangana
Hydra News : హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీకి (హైడ్రా) ను మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా మార్చేందుకు వీలుగా బల్దియా చట్టంలో కొత్త సెక్షన్‌ చేర్చుతూ ప్ర‌భుత్వం ఆర్డినెన్స్‌ జారీ అయింది. దీనికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ కూడా ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించి శనివారం రాజ్‌భవన్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ కోసం క‌బ్జాదారుల‌కు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టడం, అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం వంటి అధికారాలతో ప్రభుత్వం నూత‌న సెక్షన్‌ను రూపొందించింది. దానిని జీహెచ్‌ఎంసీ చట్టంలో చేర్చి, తద్వారా జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సమకూరే అధికారాలను హైడ్రాకు కూడా బ‌దలి చేయాల‌ని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాలకు మరింత సమయం ఉండటంతో.. ఆ నిర్ణయాన్ని తక్షణం అమల్లోకి తెచ్చేందుకు ఆర్డినెన్స్‌ జారీ ...
Sanjauli mosque | మసీదు 3 అంతస్తుల కూల్చివేతకు సిమ్లా కోర్టు ఆదేశం..!

Sanjauli mosque | మసీదు 3 అంతస్తుల కూల్చివేతకు సిమ్లా కోర్టు ఆదేశం..!

National
Sanjauli mosque | హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలోని వివాదాస్పద మసీదు మూడు అంతస్తులను కూల్చివేయాలని కోర్టు ఆదేశించింది. ఇందుకోసం సిమ్లా మున్సిపల్ కమీషనర్ (MC) కు కోర్టు రెండు నెలల సమయం ఇచ్చింది. మసీదు నిర్మాణం చట్టవిరుద్ధమని వివిధ సంస్థలు ప్రకటించడంతో వివాదం వెలుగులోకి వచ్చింది. కొన్ని హిందూ సంస్థలు, స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే..మసీదుకు సంబంధించి కొనసాగుతున్న పిటిషన్‌లో తమను పార్టీగా చేయాలంటూ స్థానికులు చేసుకున్న దరఖాస్తును కోర్టు కొట్టివేసింది. మసీదు కూల్చివేతకు అయ్యే ఖర్చును మసీదు కమిటీ సభ్యులు భరిస్తారు. ముస్లిం వక్ఫ్ బోర్డు తరపున న్యాయవాది బిఎస్ ఠాకూర్ మాట్లాడుతూ, "మసీదు పక్కన  పరిమితికి మించి ఉన్న నిర్మాణాన్ని కూల్చివేయాలని మసీదు కమిటీ సమర్పించిన సమర్పణను కోర్టు అంగీకరించింది." తమ సొంత ఖర్చులతో కూల్చివేత చేసేందుకు కమిటీ సభ్యులకు కోర్టు రెండు నెలల గడువు ఇచ...
Goa Train | సికింద్రాబాద్‌ నుంచి గోవాకు రైలు.. మరి కొద్ది రోజుల్లో ప్రారంభం  

Goa Train | సికింద్రాబాద్‌ నుంచి గోవాకు రైలు.. మరి కొద్ది రోజుల్లో ప్రారంభం  

Telangana
Secunderabad-Goa Train | గోవా వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్‌.. సికింద్రాబాద్‌ నుంచి గోవాకు వెళ్లేందుకు కొత్తగా రైలును అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌క‌టించింది. సికింద్రాబాద్ – వాస్కోడిగామా (గోవా) – సికింద్రాబాద్‌ మధ్య కొత్తగా బై వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టేందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపిందని ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. కొత్త రైలును అక్టోబ‌ర్‌ 6న ప్రారంభించనున్నట్లు పేర్కొంది. సికింద్రాబాద్‌ – వాస్కోడగామా (07039) వన్‌ వే స్పెషల్‌ రైలును ఉదయం 11.45 గంటలకు ప్రారంభించనుందిజ ఈ నెల 9 నుంచి రెగ్యులర్‌ సేవలు ప్రారంభ‌మ‌వుతాయ‌ని సౌత్‌సెంట్ర‌ల్ రైల్వే పేర్కొంది. సికింద్రాబాద్‌ – వాస్కోడిగామా (17039) రైలు ప్రతీ బుధవారం, శుక్రవారాల్లో సేవ‌లందించ‌నుంద‌ని, ఇక తిరుగు ప్ర‌యాణంలో వాస్కోడిగామా – సికింద్రాబాద్‌ (17040) రైలు గురువారం, శనివారాల్లో న‌డుస్తుంద‌ని చెప్పింది....
Electric Ordinary Buses | నగరంలో ఎలక్ట్రిక్ ఆర్డినరీ బస్సులొస్తున్నాయ్..

Electric Ordinary Buses | నగరంలో ఎలక్ట్రిక్ ఆర్డినరీ బస్సులొస్తున్నాయ్..

Telangana
Electric Ordinary Buses in Hyderabad | హైదరాబాద్ మహానగరంలో సమీప భవిష్కత్ లో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులే పరుగులుపెట్టన్నాయి. పాత బస్సుల స్థానంలో కొత్త డీజీల్ బస్సులకు బదులుగా పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) భావిస్తోంది. ఇటీవ‌ల విద్యుత్ మెట్రో బ‌స్సుల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌గా ద‌స‌రా (Dasara ) క‌ల్లా విద్యుత్‌ ఆర్డినరీ బస్సులు కూడా రాబోతున్నాయి.ప్రస్తుతం ఉన్న ఆర్డినరీ బస్సులకు విభిన్నంగా ఆక‌ర్ష‌నీయంగా చూడ‌డానికి ఏసీ బస్సుల్లా క‌నిపించ‌బోతున్నాయి.హైద‌రాబాద్ లో ఇప్పటికే ఏసీ, నాన్‌ ఏసీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ ఎల‌క్ట్రిక్‌ బస్సులను తీసుకొచ్చిన ఆర్టీసీ తాజాగా ఆర్డినరీ బస్సుల‌ను కూడా తీసుకురాబోతోంది. ప్రయాణికుల స్పందన ఆధారంగా విడతల వారీగా మరిన్ని ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కొత్తగా వచ్చే ఎలక్ట్రిక్‌ ఆర్డినరీ బస్సులను ఏ మార్...
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్