
Earthquake in Telangana | తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం, ములుగు కేంద్రంగా ప్రకంపణలు
Earthquake in Telangana | తెలుగు రాష్ట్రాల్లో బుధవారం ఉదయం భూ ప్రకంపణలు సంభవించాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (National Center for Seismology) ప్రకారం బుధవారం ఉదయం తెలంగాణలో 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. NCS ప్రకారం ఉదయం 7:27 గంటలకు ప్రకంపనలు నమోదయ్యాయి. ములుగు జిల్లాలో 40 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం కేంద్రీకృతమై ఉంది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో NCS పోస్ట్ చేసిన వివరాల ప్రకారం.. "EQ ఆఫ్ M: 5.3, ఆన్: 04/12/2024 07:27:02 IST, చివరి: 18.44 N, పొడవు: 80.24 E, లోతు: 40 కి.మీ, స్థానం: ములుగు, తెలంగాణ.ఖమ్మం, మహబూబాబాద్, నల్గొండ, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల, భద్రాద్రి జిల్లాల్లో పలుచోట్ల ప్రకంపనలు వచ్చాయి. ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం, చర్ల, చింతకాని, నాగులవంచ, మణుగూరు, భద్రాచ...