Home Local Nimishamba Devi | నిమిషాంబ దేవి ఆల‌యంలో 3 నుంచి దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రోత్స‌వాలు..

Nimishamba Devi | నిమిషాంబ దేవి ఆల‌యంలో 3 నుంచి దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రోత్స‌వాలు..

0
7
Sridevi Sharannavarathrotsavam
Nimishamba temple kerthinagar
Spread the love

Sridevi Sharannavarathrotsavam | గ్రేట‌ర్‌ వ‌రంగ‌ల్ ప‌రిధిలోని 16వ డివిజ‌న్ కీర్తిన‌గ‌ర్ హౌసింగ్ బోర్డ్ కాల‌నీలోని ప్ర‌సిద్ధ శ్రీ నిమిషాంబ దేవి (Nimishamba Devi)  అమ్మ‌వారి ఆల‌యంలో అక్టోబ‌ర్ 3 గురువారం నుంచి 12వ తేదీ వ‌ర‌కు దేవీ శ‌ర‌న్న‌వరాత్రోత్స‌వాల‌ను నిర్వ‌హించ‌నున్నారు.
మొదటి రోజు 03-10-2024 గురువారం ఉద‌యం 6-00 గంట‌లకు గణపతిపూజ, పుణ్యాహావచనం, అంకురార్పణ, అభిషేకం, రక్షాబంధనం, కలశస్థాపనం, అఖండదీపం కార్యక్రమాలు ఉంటాయని ఆల‌య క‌మిటీ తెలిపింది.

అలాగే 03-10-2024 నుంచి 12-10-2023 విజయదశమి రోజు వరకు అమ్మవారు ఒక్కొక్క అవతారంలో అమ్మ‌వారు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. విజయదశమి శనివారం రోజు ఉదయం అమ్మవారిని అభిషేకించి, కలశ ఉద్వాసన, పూర్ణాహుతి చేసిన తదుపరి అమ్మవారికి విశేషపూజలు అర్చనలు, మంగళరతులు, తీర్థప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం 5-00 గంట‌లకు జమ్మిపూజ నిర్వ‌హించ‌నున్నారు. రాత్రి 9-00 గంట‌లకు కుంభ బలి, కూష్మాండబలి ఇచ్చి ధ్వజపట అవరోహణతో అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వరిసమాప్తమ‌వుతాయ‌ని ఆల‌య క‌మిటీ పేర్కొంది. ప్రతి రోజు ఉద‌యం 9-00 గంట‌లకు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం, అష్టోత్తర పూజలు, అర్చనలు సాయంత్రం వేదపారాయణం, మంగళహారతులు, కాగా ప్ర‌తీ రోజు ఉద‌యం 10గంట‌ల‌కు చండీహోమం నిర్వ‌హించ‌నున్నారు.

  • 03-10-2024 గురువారం బాలత్రిపుర సుందరిదేవి అవతారం
  • 04-10-2024 శుక్ర‌వారం గాయ‌త్రీదేవి అవ‌తారం
  • 05-10-2024 శ‌నివారం అన్నపూర్ణ దేవి అవతారం
  • 06-10-2024 ఆదివారం శ్రీ మహాలక్ష్మి దేవి అవతారం
  • 07-10-2024 సోమ‌వారం శ్రీ చండీ దేవి అవతారం
  • 08-10-2024 మంగ‌ళ‌వారం శ్రీ సరస్వతిదేవి అవతారం
  • 09-10-2024 బుధ‌వారం శ్రీ లలితత్రిపుర సుందరి దేవి అవతారం
  • 10-10-2024 గురువారం దుర్గాదేవి అవ‌తారం.
  • 11-10-2024 శుక్రవారం శ్రీ మహిషాసురమర్ధిని అవతారం
  • 12-10-2024 శ‌నివారం శ్రీ నిమిషాంబ‌ దేవి/ రాజ‌రాజేశ్వ‌రీదేవి అవతారం

నిమిషాంబదేవి ఆలయంలో శరన్నవరాత్రి (Sridevi Sharannavarathrotsavam) ఉత్సవాలకు సంబంధించిన పూర్తి వివ‌రాల‌కు ఆల‌య అర్చ‌కులు సౌమిత్రి క‌ళ్యాణ్ ఆచార్యులు (7569494938) అలాగే ఆల‌య‌ క‌మిటీ ప్ర‌తినిధులు 7702401936, 8106346086 ຜ 9346877937, 9866135004, 8328525281, 939991307 ఫోన్ నెంబ‌ర్ల‌లో సంప్ర‌దించ‌వ‌చ్చు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here