Railway News | వరంగల్ – సికింద్రాబాద్ మీదుగా రెండు రైళ్లు రద్దు..
Railway News | హైదరాబాద్ : సికింద్రాబాద్ డివిజన్ లో ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కోసం ట్రాఫిక్ బ్లాక్ కారణంగా ఆగస్టు 1 నుంచి 31 వరకు పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు (Trains Cancelled ) చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-వరంగల్ మెము (07462), వరంగల్-హైదరాబాద్ మెము (07463) రైళ్లను రద్దు చేసినట్లు ఒక పత్రికా ప్రకటనలో.దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు. రైలు ప్రయాణీకులను దీనిని గమనించాల్సిందిగా కోరారు. అసౌకర్యాన్ని నివారించడానికి తదనుగుణంగా వారి ప్రయాణాన్ని ప్లాన్ చేసారు.
అత్యాధునిక కోచ్ లతో సికింద్రాబాద్ – విశాఖపట్నం గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
సికింద్రాబాద్-విశాఖపట్నం (12739) గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ (Secunderabad – Visakhapatnam Garib Rath Express ) రైలు ఇప్పుడు అత్యాధునిక కోచ్ లతో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్: ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్) లో తయారైన లింకే హాఫ్‌మన్ బుష్ (ఎల్‌హెచ్‌బి) కోచ్‌లతో దీనిని అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుత కోచ్‌లు పాతవయ్యాయి. ఈ క్రమంలో అన్ని గరీబ్ రథ్ రైళ్లలో కొత్తగా రూపొందించిన AC ఎకానమీ కోచ్‌లను అమర్చనున్నట్లు భారతీయ రైల్వే గతంలోనే ప్రకటించింది. పాతవాటి స్థానంలో థర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌లతో కూడిన ఎల్‌హెచ్‌బీ రేక్‌లను ఏర్పాటు చేస్తోంది. మధ్యతరగతి ప్రయాణికులు తక్కువ ధరలో ఏసీ కోచ్ లతోప్రయాణించేందుకు వీలుగా కేంద్రంఈ గరీబ్ రథ్ రైళ్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే..
అత్యాధునిక ఫీచర్లు..
ఆధునిక సౌకర్యాలతో అప్‌గ్రేడ్ చేసిన రైళ్లు కొన్ని మార్గాల్లో సేవలను ప్రారంభించే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారులు తెలిపారు. కొత్త రేక్‌లలో 20 LHB కోచ్‌లు ఉంటాయి. వీటిలో 18 థర్డ్ AC ఎకానమీ కోచ్‌లు, రెండు జనరేటర్ మోటార్ కార్లు, చైర్ కార్లు లేకుండా ఉంటాయి.
కొత్త AC ఎకానమీ క్లాస్‌లో 81 సీట్లు, బాటిల్ హోల్డర్లు, ఫోల్డబుల్ స్నాక్ టేబుల్స్, దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు, ఆధునిక టాయిలెట్లు, మధ్య, ఎగువ బెర్త్‌ల కోసం క్లైంబింగ్ నిచ్చెనలు, వ్యక్తిగత AC వెంట్లు, రీడింగ్ లైట్లు, USB ఛార్జింగ్ సాకెట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..