Udhampur-Srinagar-Baramulla Rail | అత్యంత సుందరమైన కశ్మీర్ ప్రాంతంలో మొట్టమొదటిసారి రైలు కూతలు వినిపించనున్నాయి. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకోవడంతో కాశ్మీర్ లోయ ప్రయాణికుల సుదీర్ఘమైన చిరకాల స్వప్నం నెరవేరే క్షణాలు ఆసన్నమవుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ. 3694 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) ప్రాజెక్ట్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించేందుకు దాదాపు సిద్ధంగా ఉందని తెలిపారు.
ఇటీవల విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ దాదాపు పూర్తవుతుందని, కత్రా – రియాసి మధ్య 17 కిలోమీటర్ల T-1 సొరంగం విభాగం మాత్రమే పెండింగ్‌లో ఉందని తెలిపారు. చీనాబ్ వంతెన, సంగల్దాన్ వరకు రైల్వే లైన్ ఇప్పటికే పని చేయడంతో ఈ కీలకమైన విభాగంలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం కాశ్మీర్ ప్రజలకు మెరుగైన రవాణా, ఆర్థిక పురోభివృద్ధికి దోహదం చేస్తుంది.
సంగల్దాన్ నుండి రియాసి సెక్షన్ వరకు పూర్తయింది. కమిషనర్ రైల్వే సేఫ్టీ (CRS) సర్టిఫికేట్ కూడా వచ్చింది. కాబట్టి, జమ్మూ కాశ్మీర్ కలల ప్రాజెక్ట్ (దాదాపు) ఇప్పుడు సాకారం అయినట్టే.. దీని ప్రారంభోత్సవం కోసం తన సమయాన్ని కేటాయించాల్సిందిగా త్వరలో మేము ప్రధాని నరేంద్ర మోదీని అభ్యర్థిస్తాం, ”అని గ్రేటర్ కాశ్మీర్ డాట్ కామ్ ప్రకారం రైల్వే మంత్రి తెలిపారు .
19 బారాములా-బద్గాం-బనిహాల్ సెక్షన్‌లో ప్రయాణీకుల ప్రత్యేక రైలు సేవలు నడుస్తున్నాయి
ప్రస్తుతం, USBRL ప్రాజెక్ట్‌లోని బారాముల-బద్గామ్-బనిహాల్ విభాగంలో 19.. ప్యాసింజర్ ప్రత్యేక రైలు సేవలు నడుస్తున్నాయి. అంతేకాకుండా, ట్రాఫిక్ డిమాండ్, కార్యాచరణ సాధ్యాసాధ్యాలు , రోలింగ్ స్టాక్ లభ్యతను బట్టి కొత్త రైలు సేవలను ప్రవేశపెట్టడం లేదా ఇప్పటికే ఉన్న రైలు సేవలను పొడిగించడం వంటివి చేస్తామని అధికారులు తెలిపారు.
కశ్మీర్ కు మొట్టమొదటి రైలు..
Udhampur-Srinagar-Baramulla Rail : కఠినమైన పర్వత ప్రాంతాలు, లోయలు, కొండచరియలు విరిగిపడటం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా జమ్మూ శ్రీనగర్ మధ్య రోడ్డు ప్రయాణంపై ఆధారపడటం ప్రజలకు అనేక కష్టాలను తెచ్చిపెడుతోంది. ప్రజలకు ప్రయాణాలు తరచూ ఆలస్యమవుతుంటాయి. ఇలాంటి సమస్యలకు ప్రతిపాదిత రైల్వే లైన్ స్థిరమైన పరిష్కారాన్ని అందిస్తుంది. జమ్మూ కాశ్మీర్‌కు ప్రయాణాన్ని ఏడాది పొడవునా సాఫీగా ప్రయాణించే వీలు కల్పిస్తుంది.
కశ్మీర్ లోయలో రైల్వే సేవలను అందుబాటలోకి తీసుకురావడం వల్ల టూరిజం వృద్ధి చెందడమే కాకుండా ఉపాధి అవకాశాలు, వ్యాపారాభివృద్ధికి ఊతమిస్తుంది. అలాగే నిత్యావసర సరుకుల సరఫరా మెరుగుపడుతుంది. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అప్‌గ్రేడ్ ఈ ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్తును అందిస్తుంది. కాగా 272 కిలోమీటర్ల ప్రతిష్టాత్మకమైన విస్తీర్ణంతో ప్రాజెక్ట్ వాస్తవానికి రూ. 37,012 కోట్లు కేటాయించారు. ఆ తర్వాత పలు మార్పుల కారణంగా బడ్జెట్ 38,256 కోట్లకు పెరిగింది.
ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు కనెక్టివిటీ కీలక వివరాలు
- కత్రా-బనిహాల్ మార్గంలో అంతర్భాగమైన బనిహాల్-ఖారీ-సంబర్-సంగల్దాన్ విభాగం అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్ట్‌లో పురోగతి.
- బారాముల్లా నుంచి బనిహాల్ మీదుగా సంగల్దాన్ వరకు రైల్వే సేవలను అందించే ప్రస్తుత కొనసాగుతున్న మార్గం అంచనా వ్యయం రూ. 15,836 కోట్లు.
- ముఖ్యంగా, ఇది టన్నెల్-50తో కూడిన 16 వంతెనలను కలిగి ఉంది. ఇది 12.77 కి.మీ పొడవునా విస్తరించి దేశంలోనే అతి పొడవైన సొరంగంగా నిలుస్తుంది.
- ఇంకా, ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 43.37 కి.మీల మేర 11 సొరంగాలు ఉన్నాయి. దానితో పాటు 30.1 కి.మీ విస్తరించి ఉన్న 3 ఎస్కేప్ టన్నెల్స్ భద్రతకు ప్రాధాన్యతనిస్తాయి.
- బారాముల-శ్రీనగర్-బనిహాల్-సంగల్దాన్ మార్గంలో 185.66 ఆర్‌కెఎమ్‌ల పూర్తి విద్యుదీకరణ, 19 రైల్వే స్టేషన్‌లకు సేవలు అందించడం మరొక గణనీయమైన విజయం. దీని విద్యుదీకరణ ఖర్చు రూ. 470.23 కోట్లు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..