
Railway News | పర్వతాల మధ్య రైలు కూతలు.. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు కనెక్టివిటీ త్వరలో ప్రారంభం..
Udhampur-Srinagar-Baramulla Rail | అత్యంత సుందరమైన కశ్మీర్ ప్రాంతంలో మొట్టమొదటిసారి రైలు కూతలు వినిపించనున్నాయి. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ ప్రాజెక్ట్ చివరి దశకు చేరుకోవడంతో కాశ్మీర్ లోయ ప్రయాణికుల సుదీర్ఘమైన చిరకాల స్వప్నం నెరవేరే క్షణాలు ఆసన్నమవుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో జమ్మూ కాశ్మీర్‌లోని రైల్వే ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ. 3694 కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైలు లింక్ (USBRL) ప్రాజెక్ట్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించేందుకు దాదాపు సిద్ధంగా ఉందని తెలిపారు.ఇటీవల విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ ప్రాజెక్ట్ దాదాపు పూర్తవుతుందని, కత్రా - రియాసి మధ్య 17 కిలోమీటర్ల T-1 సొరంగం విభాగం మాత్రమే పెండింగ్‌లో ఉందని తె...