Home » Indian Railways : ఏపీలోని పది రైల్వే స్టేషన్లకు మ‌హ‌ర్ద‌శ అమృత్ భారత్ కు ఎంపికైన జాబితా ఇదే..
Amrut Bharat Station Scheme

Indian Railways : ఏపీలోని పది రైల్వే స్టేషన్లకు మ‌హ‌ర్ద‌శ అమృత్ భారత్ కు ఎంపికైన జాబితా ఇదే..

Spread the love

Amrut Bharat Station Scheme | కేంద్ర‌ బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం తిరుపతి, ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఏకంగా పది రైల్వే స్టేషన్లను అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద ఎంపిక చేసింది. ఈ రెండు జిల్లాల పరిధిలో మొత్తం పది రైల్వే స్టేషన్ల రూపురేఖ‌లు పూర్తిగా మారిపోనున్నాయి, కాగా,
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేలకు 2024-25 సంవత్సరానికి రూ.9,151 కోట్లు కేటాయించిన‌ట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల (కొత్త ట్రాక్‌లు) మొత్తం విలువ రూ. 73,743 కోట్లు అని వివ‌రించారు. భద్రతను పెంచేందుకు 743 RoBలు, RuBలను నిర్మించామని తెలిపారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా ఏపీ లోని మొత్తం 73 రైల్వే స్టేషన్‌లను పునరాభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

స్టేష‌న్ల వివ‌రాలు

తిరుపతి, రేణిగుంట, శ్రీకాళహస్తి, పాకాల, చిత్తూరు, మదనపల్లె రోడ్డు, పీలేరు, కుప్పం, గూడూరు, సూళ్ళూరుపేట స్టేషన్లు ఉన్నాయి. కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73 రైల్వే స్టేషన్లను కేంద్రం ఎంపిక చేయగా అందులో ఈ ప్రాంతానివే పది స్టేషన్లు ఉన్నాయి. అమృత్‌ భారత్‌ పథకం కింద రైల్వే స్టేషన్లను పూర్తి స్థాయిలో పున‌రాభివృద్ధి చేయ‌నున్నారు. ఇందులో భాగంగా అత్యాధునిక సౌక‌ర్యాలు, హంగులతో వీటిని తీర్చిదిద్ద‌నున్నారు. అయితే స్టేషన్ల వారీగా కేటాయించిన నిధుల వివరాలు ఇంకా వెల్లడించ‌లేదు.

READ MORE  ఐదేళ్ల బాలుడిపై కుక్కల గుంపు దాడి..

ఇప్ప‌టికే రాష్ట్రంలోని ప‌లు రైల్వే స్టేషన్లను ఆధునికీకరించారు. తాజాగా కేంద్రం అమృత్‌ పథకం కిందకు కొత్త స్టేష‌న్ల‌ను చేర్చడంతో ఆధునికీకరణ, అభివృద్ధి పరంగా ముందుకుసాగనున్నాయి. ఇక ఎంపికైన రైల్వే స్టేషన్లను పరిశీలిస్తే తిరుపతి, శ్రీకాళహస్తి స్టేషన్లు పుణ్యక్షేత్రాలు కాగా, గూడూరు, రేణిగుంట, పాకాల స్టేషన్లు రైల్వే జంక్షన్లు గా ఉన్నాయి. ఇక‌ సూళ్ళూరుపేట తమిళనాడు సరిహద్దుల్లో, కుప్పం కర్ణాటక సరిహద్దుల్లోనూ కీలకమైన‌ స్టేషన్లుగా గుర్తించారు. చిత్తూరు స్టేష‌న్ ప్ర‌ధాన జిల్లా కేంద్రంతో పాటు తమిళనాడు సరిహద్దుల్లో ముఖ్య‌మైన‌ స్టేషన్ గాఉంది. ఇక పీలేరు ఉమ్మడి చిత్తూరు జిల్లా నడిబొడ్డున ముఖ్యమైన కీల‌క‌ స్టేషన్‌గా మారింది.వివిధ‌ ప్రాధాన్యతల ఆధారంగా ఆయా స్టేష‌న్ల‌ను అమృత్‌ పథకం పరిధిలోకి కేంద్ర ప్రభుత్వం తీసుకువ‌చ్చిందని తెలుస్తోంది.

READ MORE  పండుగ వేళ ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్.. తిరుపతి వెళ్లే ప‌లు రైళ్ల‌కు అద‌న‌పు కోచ్ లు

 తెలంగాణలో 40 రైల్వే స్టేషన్‌లు..

Amrut Bharat Station Scheme in Telangana తెలంగాణ రాష్ట్రానికి 2024-25 సంవత్సరానికి గానూ రూ.5,336 కోట్లు కేటాయించినట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తెలంగాణలో ప్రస్తుతం కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టుల పనులు మొత్తం వ్యయం రూ . 32,946 కోట్లు కాగా, రైల్వే నెట్‌వర్క్ 100% విద్యుదీకరణ పూర్త‌యింద‌ని చెప్పారు. తెలంగాణ లోని 40 రైల్వే స్టేషన్‌లను అమృత్‌ భారత్‌ స్టేషన్‌ స్కీమ్‌ కింద పునరాభివృద్ధి చేస్తున్నామని మంత్రి వివ‌రించారు.


READ MORE  Sabarimala Special Trains | అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్, శబరిమలకు 22 ప్రత్యేక రైళ్లు

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..