Monday, May 4, 2026
AndhrapradeshTelangana

Rains | ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు

Spread the love

బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రరూపం దాల్చుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వెంట ఈ వాయుగుండం కేంద్రీకృతమై  ఉందని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు ,తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు పలు జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. నేడు రాష్ట్రంలో పగటి పూట వాతావరణం పొడిగా ఉంటుందని.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఇక అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అల్పపీడనం క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ నైరుతి దానిని ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడుతో పాటు దక్షిణ కోస్తా తీరాల వెంట కేంద్రీకృతమైందని తెలిపారు.. నేడు బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు, జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.. తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి సీతారామ రాజు, విశాఖపట్నం, అనకాపల్లి, గుంటూరు, వైఎస్ఆర్ జిల్లా, అనంతపురం, సత్యసాయి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని అక్కడక్కడ   తేలికపాటి వర్షాలకు అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

 

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

Kiran Podishetty

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే.. Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..