
TG Inter Results | బాలికలదే హవా.. ఇంటర్ ఫలితాలు వెల్లడి
TG Inter Results : తెలంగాణ (Telangana) ఇంటర్ (intermediate) వార్షిక పరీక్షల ఫలితాలు ఈరోజు అధికారికంగా విడుదలయ్యాయి. నాంపల్లి ఇంటర్మీడియట్ బోర్డు (BIE) కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యాశాఖ మంత్రి కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంయుక్తంగా ఫలితాలను విడుదల చేశారు.ఫస్టియర్లో 65.96 శాతం ఉత్తీర్ణతఈ ఏడాది ఇంటర్ (Inter) ఫస్టియర్, సెకండియర్ రెండు సంవత్సరాలకూ పరీక్షలకు విద్యార్థుల భారీగా హాజరు కనిపించింది. ముఖ్యంగా బాలికలు గతం మాదిరిగానే ఈసారి కూడా తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఫస్టియర్ ఫలితాల విషయానికొస్తే మొత్తం 4,88,430 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 3,22,191 మంది ఉత్తీర్ణత సాధించగా మొత్తం ఉత్తీర్ణత శాతం 65.96 శాతం గా నమోదైంది. ఇందులో బాలికలు 73.83% ఉత్తీర్ణత సాధించగా, బాలురు...