Hyderabad | రాష్ట్రంలో పతనమవుతున్న రియల్ ఎస్టేట్..
Hyderabad | రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం (Real Estate) నష్టాల్లో కూరుకుపోతోంది. ఆస్తులను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ముందుకు రావడంలేదు. బిల్డర్లు, డెవలపర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎటువంటి చర్యలను చేపట్టడంలేదు. తాజాగా కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (CREDAI ) తెలంగాణ ప్రభుత్వం పరిష్కరించాల్సిన అనేక సమస్యలను నివేదించింది. ఆగస్టులో కొన్ని సూచనలు చేసింది, అయినప్పటికీ ఎటువంటి పురోగతి లేదని క్రెడాయ్ పేర్కొంది. జిల్లాల్లో లేఅవుట్‌లకు అనుమతులు మంజూరు చేయడంలో విపరీతమైన జాప్యంపై రియల్ ఎస్టేట్ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి , రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హాజరైన కార్యక్రమంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాల్లో అనుమతుల మంజూరులో జా...