
Charlapalli Railway Station : సుమారు రూ. 413 కోట్లతో అత్యాధునిక హంగులు, సకల సౌకర్యాలతో నిర్మించిన చర్లపల్లి టెర్మినల్ ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. ఈ రైల్వే టెర్మినల్‌లో మొత్తం 19 ట్రాక్‌లు ఉన్నాయి. హైదరాబాద్ మహానగరంలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల తర్వాత చర్లపల్లి స్టేషన్ కీలకమైన టెర్మినల్ గా మారింది. ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా, వైజాగ్‌లకు వెళ్లే రైళ్లు ఇప్పుడు చర్లపల్లి నుంచే నడిపించనున్నారు. దీనివల్ల సికింద్రాబాద్, నాంపల్లి, కాచీగూడ స్టేషన్లలో రద్దీ తగ్గుతుంది. చర్లపల్లి నుంచి బయలుదేరే రైళ్లలో గోరఖ్‌పూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్, MGR చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. అలాగే గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ వంటి రైళ్లు కూడా చర్లపల్లిలో ఆగుతాయి.
రేపటి నుంచి ఈ రైళ్లు చెర్లపల్లిలో హాల్టింగ్
- సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్ (12757-12758),
- గుంటూరు- సికింద్రాబాద్- గుంటూర్ ఎక్స్‌ప్రెస్ (17201-17202),
- సికింద్రాబాద్- సిర్పూర్ కాగజ్‌నగర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్(17233-17234)
రైల్వే స్టేషన్ ఫీచర్లు
కొత్త టెర్మినల్‌లో రెండు MMTS ప్లాట్‌ఫారమ్‌లతో సహా తొమ్మిది ప్లాట్‌ఫారమ్‌లు, ఆరు ఎస్కలేటర్లు, రెండు ఫుట్ ఓవర్‌బ్రిడ్జ్‌లు ఉన్నాయి. ఎయిర్ కండిషన్డ్, నాన్-ఎయిర్ కండిషన్డ్ వెయిటింగ్ హాళ్లు, ఫుడ్ కోర్ట్‌లు, రెస్టారెంట్లు, రిజర్వేషన్ కౌంటర్లు, టిక్కెట్ కౌంటర్లు వంటి అన్ని సౌకర్యాలను ప్రయాణికుల కోసం ఏర్పాటు చేశారు.
చర్లపల్లి నుంచి బయలుదేరే రైళ్లు
గోరఖ్‌పుర్- సికింద్రాబాద్- గోరఖ్‌పుర్ ఎక్స్‌ప్రెస్ (12589/12590) సాధారణంగా సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యేది. కానీ దీనిని సికింద్రాబాద్ నుంచి కాకుండా ఇప్పుడు చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు మార్చారు. ఈ రైలు మార్చి 12వ తేదీ నుంచి చర్లపల్లి నుంచే బయలుదేరనుంది.
ఇక చెన్నై సెంట్రల్- హైదరాబాద్- చెన్నై సెంట్రల్ (12603/12604) ప్రస్తుతం నాంపల్లి నుంచి బయలుదేరుతుండగా ఇది కూడా మార్చి 7వ తేదీ నుంచి చర్లపల్లి నుంచి బయలుదేరనుంది.
పలు రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం
సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరే మూడు రైళ్లకు చర్లపల్లి రైల్వే స్టేషన్ (Charlapalli Railway Station)లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు. సికింద్రాబాద్- సిర్పూర్‌కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ (12757) ఉదయం 8.20 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి.. 8.32కి చర్లపల్లికి చేరుకుని ఒక నిమిషం ఆగనుంది. తిరుగు ప్రయాణంలో సిర్పూర్‌కాగజ్‌నగర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (12757) చర్లపల్లికి రాత్రి 7.02 గంటలకు చేరుకుంటుంది.
గుంటూరు- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (17201) చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో మధ్యాహ్నం 12.41గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్- గుంటూరు ఎక్స్‌ప్రెస్ (17202) మధ్యాహ్నం 12.50 గంటలకు చర్లపల్లిలో నిలవనుంది.
సికింద్రాబాద్- సిర్పూర్‌కాగజ్‌నగర్ (17233) ఎక్స్‌ప్రెస్ జనవరి 7 నుంచి ప్రతిరోజు సాయంత్రం 3.47 గంటలకు సిర్పూర్‌కాగజ్‌నగర్-సికింద్రాబాద్ (17234) ఉదయం 9.20 గంటలకు చర్లపల్లిలో ఆగనున్నాయి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..