Charlapalli railway station | విమానాశ్రయాన్ని తలపించేలా.. చర్లపల్లి రైల్వేస్టేషన్.. కానీ ఇక్కడికి చేరుకునేదెలా?
Charlapalli railway station | హైదరాబాద్: అత్యుత్తమ విమానాశ్రయాలను తలపించేలా రూ.430 కోట్లతో అభివృద్ధి చేసిన చర్లపల్లి రైల్వే స్టేషన్ దేశంలోని సకల సదుపాయాలతో హైటెక్ హంగులతో అల్ట్రామోడర్న్ ప్యాసింజర్ ఫెసిలిటీగా రెడీ అయింది. కొత్త స్టేషన్ వచ్చే నెలలో ప్రారంభించాలని భావిస్తున్నారు. అయితే ప్రయాణికులకు సులువుగా ఈ స్టేషన్ కు చేరుకోవడానికి సమర్థవంతమైన కనెక్టివిటీని అందించే సౌకర్యాలు ఇప్పటివరకు పూర్తిచేయలేదు.రాష్ట్ర ప్రభుత్వం చర్లపల్లి స్టేషన్‌కు వెళ్లేందుకు రెండు వైపులా రోడ్లను విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. అయితే సమన్వయ లోపంతో రోడ్డు అభివృద్ధి, విస్తరణ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. ఫలితంగా, ప్రయాణికులు ఈ స్టేషన్ కు చేరుకోవడం కష్టంగా మారింది. మరోవైపు కొత్త స్టేషన్ వైపు ఉన్న వివిధ రోడ్లను పలు కారణాల ద్వారా ప్రారంభించలేదు. ఇటీవల పూర్తయిన మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సి...