
Hyderabad Metro Rail : మెట్రో రైళ్లలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి తెలిపారు.
బుధవారం ఇక్కడి JBS మెట్రో స్టేషన్‌లో ‘Me Time On My Metro’ పేరుతో జరిగిన మూడు రోజుల వినూత్న ప్రమోషనల్ క్యాంపెయిన్‌లో ఆయన మాట్లాడారు. ఆర్డర్ ఇచ్చిన 18 నెలల్లో కొత్త రైళ్లు వస్తాయని చెప్పారు. అయితే, ప్రయాణికులు మరింత క్రమశిక్షణను పాటిస్తే, రద్దీ సమస్య భారీగా తగ్గుతుందని ఆయన అన్నారు.
ఇదిలావుండగా, కళ, సాహిత్యం, సంస్కృతికి సంబంధించిన వివిధ రంగాల్లో ప్రయాణికులు తమ అభిరుచిని ప్రదర్శించేందుకు మెట్రో రైలు అవకాశం కల్పిస్తుందని హెచ్‌ఎంఆర్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. మెట్రో ప్రయాణికులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఎంజీబీఎస్ వంటి విశాలమైన స్టేషన్లలో తగిన స్థలాన్ని కేటాయిస్తామని చెప్పారు.
సంక్రాంతి పండుగ సందర్భంగా ‘Me Time On My Metro’ అనే మూడు రోజుల వినూత్న ప్రచార కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు. కొన్ని కీలకమైన స్టేషన్ జంక్షన్లు, విశాలమైన ప్రాంతాలను ప్రత్యేక హబ్‌లుగా, అంతర్జాతీయ కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
Hyderabad Metro Rail ఫేజ్-2 పార్ట్-‘బి’లో ప్రతిపాదిత జెబిఎస్ – శామీర్‌పేట్ (22 కిమీ), ప్యారడైజ్ – మేడ్చల్ (23 కిమీ) మార్గాల కోసం మెగా జంక్షన్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి. అలాగే మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్), ఫేస్ బుక్, వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..