Sunday, April 27Thank you for visiting

Begumpet railway station : పూర్తి కావస్తున్న బేగంపేట రైల్వే స్టేషన్‌ అభివృద్ధి పనులు

Spread the love

Begumpet railway station : కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ స్కీం (Amrit Bharat Station ) లో భాగంగా తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్ పరిధిలోని బేగంపేట్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీంలో భాగంగా దేశవ్యాప్తంగా 1200 స్టేషన్లు ఆధునీకరణ చేస్తున్నారు. అందులో భాగంగా.. తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లు, హైదరాబాద్‌లో 14 స్టేషన్లను కేంద్రం పునరాభివృద్ధి చేస్తోంది .ఈ క్రమంలో హైదరాబాద్ లో కీలకమైన బేగంపేట రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేశారు. రూ.27 కోట్లతో చేపట్టిన బేగంపేట రైల్వే స్టేషన్‌ డెవలప్ మెంట్ పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం పరిశీలించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైల్వేలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని తెలిపారు. ఇటీవలే చర్లపల్లి టెర్మినల్‌ను ప్రారంభించుకున్నామని, త్వరలో బేగంపేట రైల్వే స్టేషన్‌ను ప్రారంభోత్సవం చేసుకుందామని తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు ₹5,337 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయింపులు జరిగాయని, విద్యుదీకరణ, కొత్త లైన్లు, డబ్లింగ్ మరియు ట్రిప్లింగ్ సహా ₹39,300 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయని మంత్రి తెలిపారు.

READ MORE  Amazon Web Services | హైద‌రాబాద్ లో అమెజాన్ విస్తరణ.. యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు

తెలంగాణ రైల్వే నెట్‌వర్క్ ఇప్పుడు 100% విద్యుదీకరణ చెందిందని, త్వరలో సికింద్రాబాద్‌లో ‘కవాచ్’ పరిశోధన సంస్థ (‘Kavach’ research institute ) ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేయబడిన ‘కవాచ్’ సాంకేతికతను దేశవ్యాప్తంగా నెట్‌వర్క్‌లో ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

ABSS – అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దాదాపు 40 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నారు. పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతకుముందు, దక్షిణమధ్య రైల్వే(SCR) జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ పనుల పురోగతిని వివరిస్తూ, స్టేషన్‌ను పర్యావరణ అనుకూల గ్రీన్ రైల్వే స్టేషన్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. స్టేషన్‌లో పచ్చదనం అవసరాలను తీర్చడానికి ఇది నీటి రీసైక్లింగ్ ప్లాంట్‌ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేంద్రమంత్రి వెంట దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, సికింద్రాబాద్ డివిజన్ డిఆర్‌ఎం భరతేష్ కుమార్ జైన్, ఇతర సీనియర్ రైల్వే అధికారులు ఉన్నారు.

READ MORE  తెలంగాణలో రూ.21,566 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Begumpet railway station : అభివృద్ధి పనులు ఇవే..

కాగా రూ.38 కోట్ల బడ్జెట్‌తో (దశ Iలో ₹28 కోట్లు, దశ IIలో ₹12 కోట్లు) బేగంపేట స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేస్తున్నారు. పునరాభివృద్ధి పనులు (90%) పూరి కావస్తున్నాయి. ప్రయాణికుల సౌలభ్యం కోసం బేగంపేట స్టేషన్ ప్రవేశ ద్వారాన్ని అత్యాధునికంగా సుందరీకరించారు. స్టేషన్ లోపల లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఫుట్-ఓవర్-బ్రిడ్జిలు, వెయిటింగ్ హాళ్లు ఇతర అత్యాధునిక సౌకర్యాలతో స్టేషన్‌ను ఆధునీకరించారు.

READ MORE  SCR Special Trains : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేస‌విలో భారీగా ప్రత్యేక రైళ్లు ప్ర‌క‌టించిన ద‌క్షిణ మ‌ధ్య రైల్వే..

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..