
New Zealand Tour of India | సొంతగడ్డపై భారత్ కు చేదు అనుభవం..
New Zealand Tour of India | సొంతగడ్డపై భారత్ ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. 3-0 సిరీస్ తో చారిత్రాత్మక వైట్‌వాష్‌ను పూర్తి చేసిన న్యూజిలాండ్.. స్వదేశంలో భారత్ అజేయం కాదని క్రికెట్ ప్రపంచానికి చూపించింది. అన్ని విభాగాల్లో అద్భుతమైన ఆటతీరుతో భారత జట్టును అధిగమించారు. సిరీస్ అంతటా న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్‌కు దీటుగా భారతదేశం జవాబు ఇవ్వలేకపోయింది. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్లు ఫామ్ కోల్పోవడంతో సిరీస్ అంతా నిరుత్సాహంగా మారింది.12 ఏండ్లుగా ట్రోఫీని వదలని టీమిండియా (Team India) తొలిసారి వైట్ వాష్ కు గురైంది. టన్నుల కొద్దీ పరుగులు.. రికార్డుల మీద రికార్డులు బద్దలు కొట్టిన మన బ్యాటర్లు క్రీజ్ కాసేపు కూడా నిలవలేకపోయారు. చివరకు రోహిత్ శర్మ బృందం 3-0తో సిరీస్ కోల్పోవడంతో అభిమానులు షాక్ నుంచి ఇంకా తేరుకోవడం లేదు. ముంబైలో 25 పరుగుల ఓటమి పాలయిన టీ...