Home » ‘ఖర్గే గారూ..  నా మీద కాదు.. మీ అమ్మానాన్నలను చంపిన హైదరాబాద్ నిజాం మీద కోపం తెచ్చుకోండి…’ 
Maharashtra Election

‘ఖర్గే గారూ..  నా మీద కాదు.. మీ అమ్మానాన్నలను చంపిన హైదరాబాద్ నిజాం మీద కోపం తెచ్చుకోండి…’ 

Spread the love

Maharashtra Election : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి దిగారు. మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన బహిరంగ సభలో సీఎం యోగి ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అనవసరంగా నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. ఖర్గే జీ, నా మీద కోపం తెచ్చుకోకండి, నేను మీ వయసును గౌరవిస్తాను. మీరు అగ్రహం వ్యక్తంచేయాలనుకుంటే ముందుగా హైదరాబాద్ నిజాంపై చేయండి అని సీఎం యోగి అన్నారు. మీ గ్రామాన్ని తగలబెట్టి హిందువులను నిర్దాక్షిణ్యంగా చంపిన హైదరాబాద్ నిజాం రజాకార్లు. మీ పూజ్యమైన తల్లి, సోదరి, మీ కుటుంబ సభ్యులను తగులబెట్టారు. ప్రజలు విడిపోయినప్పుడల్లా వారిని ఇలాగే చంపుతారు అనే ఈ సత్యాన్ని దేశ ప్రజలకు చెప్పండి అని కోరారు.  ఓటు బ్యాంకు కోసం ఈ సత్యాన్ని ప్రజలకు చెప్పడం లేదన్నారు. మీరు దేశానికి ద్రోహం చేస్తున్నారు. నేను యోగిని, నేను నేర్చుకున్నది ఒక్కటే, ప్రతి పని దేశం కోసమేననిఅన్నారు.

READ MORE  లోక్‌సభ ఎన్నికల్లో 121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులు. 647 మంది 8వ తరగతి ఉత్తీర్ణులు.. నివేదికలో ఆసక్తికర అంశాలు

మల్లికార్జున్ ఖర్గే ఏం చెప్పారు?

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ ‘మనం ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం’..  యోగి ఆదిత్యనాథ్ ‘బంటేంగే తో కటేంగే’ నినాదాలను విమర్శించారు. విభజిస్తే నరికివేయబడతామి చెప్పడం సాధువుల పని కాదని సీఎం యోగి పేరు చెప్పకుండానే మల్లికార్జున్ ఖర్గే అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్