Wednesday, March 26Welcome to Vandebhaarath

Tag: cm yogi

CM Yogi | యోగీ ఎనిమిదేళ్ల పాలన 222 మంది భయంకరమైన నేరస్థుల ఎన్‌కౌంటర్.. 20,221 మంది మోస్ట్ వాంటెడ్ నేరస్థుల అరెస్టు..
National, Special Stories

CM Yogi | యోగీ ఎనిమిదేళ్ల పాలన 222 మంది భయంకరమైన నేరస్థుల ఎన్‌కౌంటర్.. 20,221 మంది మోస్ట్ వాంటెడ్ నేరస్థుల అరెస్టు..

8 Years of UP CM Yogi Adityanath | ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం (Yogi Government) అధికారంలోకి వచ్చి విజయవంతంగా 8 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ ఎనిమిది సంవత్సరాలలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌ను సమూలంగా మార్చారు. గూండాల రాష్ట్రంగా పిలిచే ఉత్తరప్రదేశ్ నేడు యోగి పాలనలో నేరస్థులు, గూండాలపై పోలీసు లాఠీలు, బుల్డోజర్లు (bulldozer) తమ ప్రతాపాన్ని చూపుతున్నాయి. యోగి ప్రభుత్వ పోలీసులు ఎన్‌కౌంటర్లలో 222 మంది పేరుమోసిన నేరస్థులు హతమయ్యారు. సుమారు 8,118 మంది గాయపడ్డారు.మోస్ట్ వాంటెండ్ నేరస్తులుయుపి పోలీసులు (Uttarpradesh Police) 20,221 మంది వాంటెడ్ నేరస్థులను అరెస్టు చేయగా, 79,984 మందిపై గ్యాంగ్‌స్టర్ చర్యలు తీసుకున్నారు. 930 మందిపై NSA చర్యతో, రూ.142 బిలియన్లకు పైగా విలువైన ఆస్తులు జప్తు చేశారు. దీనితో పాటు, జూలై 2023 నుంచి డిసెంబర్ 2024 వరకు ఆపరేషన్ కన్విక్షన్ కింద, 51 మంది న...
Prayagraj Fire Accident : మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం
National

Prayagraj Fire Accident : మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం

Prayagraj Fire Accident : మహా కుంభమేళా ప్రాంతంలో ఆదివారం సిలిండర్ పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే అదృష్ట‌వ‌శాత్తు ఎటువంటి ప్రాణనష్టం జ‌ర‌గ‌లేదు.“మహా కుంభమేళా సెక్టార్ 19లో రెండు సిలిండర్లు పేలడంతో శిబిరాల్లో భారీ మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారని అఖారా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ భాస్కర్ మిశ్రా తెలిపారు.మహా కుంభ్ 2025 అధికారిక X హ్యాండిల్ లో ఓ పోస్టులో వివ‌రాలు వెల్ల‌డించారు. “చాలా విచారకరం! #మహాకుంభ్‌లో జరిగిన అగ్నిప్రమాదం అందరినీ కలచివేసింది. ప్ర‌భుత్వం వెంట‌నే ర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టింది. అందరి భద్రత కోసం మా గంగాదేవిని ప్రార్థిస్తున్నాం. మంటలు అదుపులో ఉన్నాయని, అవి వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.Prayagraj Fire Accident : కట్టుదిట్టమైన చర్యలు చేపట్టిన యోగీ ప్రభుత్వంతాత్కాలిక మహా కుంభ్ నగరం...
CM Yogi | కాంగ్రెస్ పై విరుచుకుప‌డిన సీఎం యోగీ అదిత్య‌నాథ్‌
Trending News

CM Yogi | కాంగ్రెస్ పై విరుచుకుప‌డిన సీఎం యోగీ అదిత్య‌నాథ్‌

CM Yogi Adityanath | న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ (UP CM Yogi Adityanath) కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ "డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ (BR Ambedkar)ను అగౌరవపరుస్తోందని, దళితులు, అణగారిన వర్గాలను నిర్లక్ష్యం చేస్తోందని" ఆరోపించారు.మీడియా సమావేశంలో ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, కాంగ్రెస్ కేవలం ముస్లింల గురించి మాత్రమే పట్టించుకుంటున్నదని ఆరోపించారు. నాడు అంబేద్కర్‌ ఎన్నికల్లో ఓడిపోవ‌డానికి కాంగ్రెస్‌ కుట్ర పన్నిందని, ఆయన చేసిన సేవలను తగిన విధంగా గౌరవించ‌లేద‌ని సీఎం యోగీ ఆరోపించారు. బాబా సాహెబ్‌కు స్మారక చిహ్నాలు నిర్మించాలని కాంగ్రెస్ ఎన్నడూ ఆలోచించలేదని, అందుకు భిన్నంగా అంబేద్కర్ జీవితానికి సంబంధించిన ఐదు కీలక స్థలాలను గుర్తు చేస్తూ భారతీయ జనతా పార్టీ 'పంచతీర్థాన్ని' అభివృద్ధి చేసిందని ఆయన అన్నారు.ఎమర్జెన్సీ సమయంలో అప్ప‌టి కాంగ్రెస్ ...
నర్సు చేసిన ఈ తప్పిదంతో పెను ప్ర‌మాదం..? 10 మంది నవజాత శిశువులు సజీవ‌ద‌హ‌నం
Crime

నర్సు చేసిన ఈ తప్పిదంతో పెను ప్ర‌మాదం..? 10 మంది నవజాత శిశువులు సజీవ‌ద‌హ‌నం

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ (ఎన్‌ఐఎస్‌యు)లోని పిల్లల వార్డులో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. కొద్ది క్ష‌ణాల్లోనే ఎన్‌ఐఎస్‌యూ వార్డులో మంటలు వ్యాపించాయి. అగ్ని ప్రమాదంలో 10 మంది చిన్నారులు మృతి చెందగా, మ‌రో 16 మంది చిన్నారులు ప్రాణాలతో పోరాడుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. అయితే అగ్నిప్రమాదానికి ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయి.ప్రాథమిక సమాచారం ప్రకారం, ఎన్‌ఐఎస్‌యులోని ఓ భాగంలో అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. ఈ ఘటన రాత్రి 10:30 నుంచి 10:45 గంటల మధ్య జరిగినట్లు సమాచారం. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే చైల్డ్ వార్డు కిటికీని పగులగొట్టి సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా 35 మందికి పైగా చిన్నారులను సురక్షితంగా రక్షించార...
‘ఖర్గే గారూ..  నా మీద కాదు.. మీ అమ్మానాన్నలను చంపిన హైదరాబాద్ నిజాం మీద కోపం తెచ్చుకోండి…’ 
Elections

‘ఖర్గే గారూ..  నా మీద కాదు.. మీ అమ్మానాన్నలను చంపిన హైదరాబాద్ నిజాం మీద కోపం తెచ్చుకోండి…’ 

Maharashtra Election : కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో ఎదురుదాడికి దిగారు. మహారాష్ట్రలోని అకోలాలో జరిగిన బహిరంగ సభలో సీఎం యోగి ప్రసంగిస్తూ.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అనవసరంగా నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. ఖర్గే జీ, నా మీద కోపం తెచ్చుకోకండి, నేను మీ వయసును గౌరవిస్తాను. మీరు అగ్రహం వ్యక్తంచేయాలనుకుంటే ముందుగా హైదరాబాద్ నిజాంపై చేయండి అని సీఎం యోగి అన్నారు. మీ గ్రామాన్ని తగలబెట్టి హిందువులను నిర్దాక్షిణ్యంగా చంపిన హైదరాబాద్ నిజాం రజాకార్లు. మీ పూజ్యమైన తల్లి, సోదరి, మీ కుటుంబ సభ్యులను తగులబెట్టారు. ప్రజలు విడిపోయినప్పుడల్లా వారిని ఇలాగే చంపుతారు అనే ఈ సత్యాన్ని దేశ ప్రజలకు చెప్పండి అని కోరారు.  ఓటు బ్యాంకు కోసం ఈ సత్యాన్ని ప్రజలకు చెప్పడం లేదన్నారు. మీరు దేశానికి ద్రోహం చేస్తున్నారు. నేను...
CM Yogi Adithyanath | అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌.. మ‌హారాష్ట్ర‌లో సంచ‌ల‌నం రేపుతున్న యోగీ పోస్ట‌ర్లు
Elections

CM Yogi Adithyanath | అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌.. మ‌హారాష్ట్ర‌లో సంచ‌ల‌నం రేపుతున్న యోగీ పోస్ట‌ర్లు

CM Yogi Adithyanath | యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ త‌నదైన పాల‌న‌తో ఉత్త‌ర ప్ర‌దేశ్ రూపురేఖ‌ల‌ను స‌మూలంగా మార్చేశారు. ఇపుడు ఆయ‌న ఇమేజ్‌ను మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో కూడా ఉప‌యోగ‌పడుతోంది. దేశంలో ప్రధాని మోదీ తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న బీజేపీ నేత సీఎం యోగి ఆదిత్యనాథ్. బెంగాల్-త్రిపుర నుంచి కర్ణాటక-తెలంగాణ వరకు సీఎం యోగి ఎన్నికల ప్రచార‌కార్య‌క్రామ‌ల‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. క్రిమినల్ కేసుల్లో నిందితుల‌పై ఈ బుల్డోజర్ బాబా తీసుకునే చ‌ర్య‌లు బిజెపి పాలిత రాష్ట్రాలనే కాకుండా ప్రతిపక్ష రాష్ట్రాలను కూడా సంతోషపరుస్తుంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న హిమాచల్‌లోనూ, ఆమ్‌ ఆద్మీ పార్టీ పాలించిన పంజాబ్‌లోనూ ఇది స్పష్టంగా కనిపిస్తోంది.ఇటీవ‌ల ముంబై వీధుల్లో సీఎం యోగి పోస్టర్లు బాగా పాపుల‌ర్ అయ్యాయి. దానిపై యోగీ ప్రకటన 'బాటేంగే టు కటేంగే...' అని రాసి ఉంది. ప్ర‌స్తుతం ఇది వేగంగా వైరల్ అవుతోంది. ముంబైలో ఉత్తరప్రదే...
Himachal Pradesh | ఫాస్ట్ ఫుడ్, హోటళ్లలో నిర్వాహకుల వివరాలను ప్ర‌ద‌ర్శించాల్సిందే.. లేకుంటే కఠిన చర్యలు తప్పవు..
Trending News

Himachal Pradesh | ఫాస్ట్ ఫుడ్, హోటళ్లలో నిర్వాహకుల వివరాలను ప్ర‌ద‌ర్శించాల్సిందే.. లేకుంటే కఠిన చర్యలు తప్పవు..

Himachal Pradesh : తినుబండారాల స్టాళ్లు, ఔట్‌లెట్ యజమానులు వారి వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పబ్లిక్ వర్క్స్ అర్బన్ డెవలప్‌మెంట్ , మున్సిపల్ కార్పొరేషన్‌తో జరిగిన సమావేశంలో ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు కాంగ్రెస్ నేత, రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ తెలిపారు.మేము అర్బన్ డెవలప్‌మెంట్ , మునిసిపల్ కార్పొరేషన్ అధికారుల‌తో సమావేశం నిర్వ‌హించామ‌ని, పరిశుభ్రమైన ఆహారం విక్రయిస్తున్నార‌ని నిర్ధారించుకోవడానికి, వీధి వ్యాపారులందరికీ.. ముఖ్యంగా తినుబండారాల‌ను వస్తువులను విక్రయించే వారి కోసం ఒక నిర్ణయం తీసుకున్నామ‌ని విక్రమాదిత్య మీడియాకు తెలిపారు. .వీధుల్లో విక్రయించే ఆహార పదార్థాల పరిశుభ్రతపై ప్రజలు ఆందోళనలు, సందేహాలను వ్యక్తం చేశారని ఆయన అన్నారు. దీనిని పరిగణనలోకి తీసుకుని, యుపిలో అమ‌లు అవుతున్న‌ విధానాన్ని ఇక్క‌డ కూడా ప్ర‌వేశ...
Utter Pradesh | యూపీలో యోగీ ఎఫెక్ట్..  అవినీతి అధికారులను విధుల నుంచి తొలగింపు..
National

Utter Pradesh | యూపీలో యోగీ ఎఫెక్ట్.. అవినీతి అధికారులను విధుల నుంచి తొలగింపు..

లక్నో: అధికార దుర్వినియోగం, పనిలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారులను యోగి ఆదిత్యనాథ్ (Adithyanath) నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. విధుల నుంచి తొలగించబడిన వారిలో Utter Pradesh ముజఫర్‌నగర్‌కు చెందిన కన్సాలిడేషన్ ఆఫీసర్ అనూజ్ సక్సేనా కూడా ఉన్నారు.బల్లియాలో విధులు నిర్వర్తిస్తున్న  కన్సాలిడేషన్ ఆఫీసర్ శివశంకర్ ప్రసాద్ సింగ్ వార్షిక వేతన పెంపును కూడా ప్రభుత్వం నిలిపివేసింది. మీరట్ నుంచి అసిస్టెంట్ కన్సాలిడేషన్ ఆఫీసర్ మనోజ్ కుమార్ నీరజ్‌ను కూడా తొలగించింది. ఇంకా, కన్సాలిడేషన్ ఆఫీసర్ అవదేశ్ కుమార్ గుప్తా, అసిస్టెంట్ కన్సాలిడేషన్ ఆఫీసర్ కుమార్‌లపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు.  యాదవ్, అఖిలేష్ కుమార్ పనిలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. నితిన్ చౌహాన్‌పై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించినట్లు కన్సాలిడేషన్ కమిషనర్ జిఎస్ నవీన్ కుమార్ విలేకరులతో అ...