Home » Utter Pradesh | యూపీలో యోగీ ఎఫెక్ట్.. అవినీతి అధికారులను విధుల నుంచి తొలగింపు..
Utter Pradesh

Utter Pradesh | యూపీలో యోగీ ఎఫెక్ట్.. అవినీతి అధికారులను విధుల నుంచి తొలగింపు..

Spread the love

లక్నో: అధికార దుర్వినియోగం, పనిలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారులను యోగి ఆదిత్యనాథ్ (Adithyanath) నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. విధుల నుంచి తొలగించబడిన వారిలో Utter Pradesh ముజఫర్‌నగర్‌కు చెందిన కన్సాలిడేషన్ ఆఫీసర్ అనూజ్ సక్సేనా కూడా ఉన్నారు.

బల్లియాలో విధులు నిర్వర్తిస్తున్న  కన్సాలిడేషన్ ఆఫీసర్ శివశంకర్ ప్రసాద్ సింగ్ వార్షిక వేతన పెంపును కూడా ప్రభుత్వం నిలిపివేసింది. మీరట్ నుంచి అసిస్టెంట్ కన్సాలిడేషన్ ఆఫీసర్ మనోజ్ కుమార్ నీరజ్‌ను కూడా తొలగించింది. ఇంకా, కన్సాలిడేషన్ ఆఫీసర్ అవదేశ్ కుమార్ గుప్తా, అసిస్టెంట్ కన్సాలిడేషన్ ఆఫీసర్ కుమార్‌లపై క్రమశిక్షణ చర్యలు చేపట్టారు.  యాదవ్, అఖిలేష్ కుమార్ పనిలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. నితిన్ చౌహాన్‌పై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించినట్లు కన్సాలిడేషన్ కమిషనర్ జిఎస్ నవీన్ కుమార్ విలేకరులతో అన్నారు.
Utter Pradesh రాష్ట్రంలోని అన్ని కన్సాలిడేషన్ అథారిటీలు తమ అధికారిక బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించామని, విఫలమైతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. 2023-24 వరకు మొత్తం 1,34,425 కేసులను పరిష్కరించినట్లు కన్సాలిడేషన్ కమిషనర్ తెలిపారు. ఈ సంవత్సరం 231 గ్రామాలు భూసమీకరణ చట్టంలోని సెక్షన్ 52 (1) ప్రకారం పూర్తి చేయబడ్డాయి. విద్యుత్తు శాఖలో కూడా విద్యుత్ దుర్వినియోగం ఆరోపణలపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. అవినీతి, అధికార దుర్వినియోగం పట్ల యోగి ఆదిత్యనాథ్ జీరో-టాలరెన్స్ పాలసీ విధానాన్ని అమలు చేస్తోంది.

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

READ MORE  Lok Sabha Elections 2024 | ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది... 7 దశల్లో ఎన్నికలు.. ఏపీ, తెలంగాణ..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..