Car Running Cost Comparison : కారుని ఎంచుకునేటప్పుడు రన్నింగ్ ఖర్చులు కీలకమైన అంశంగా గుర్తించాలి.. పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ కార్లు ఒక్కో విధమైన రన్నింగ్ కాస్ట్ కలిగి ఉంటాయి. ఢిల్లీలో ఇంధన ధరల ప్రకారం… మీరు ఎంచుకున్న కార్ల మైలేజ్/రేంజ్‌ని బట్టి 100 కి.మీ వరకు ఎంత ఖర్చు వస్తుందో ఒకసారి పోల్చి చూద్దాం..
పెట్రోల్ కార్ (మారుతి స్విఫ్ట్): పెట్రోల్‌తో నడిచే మారుతి స్విఫ్ట్ 25.75 kmpl మైలేజీ అందిస్తుంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 96.65తో, 100 కి.మీ ఖర్చు లెక్కింపు ఇలా
ఇంధనం ఎంత అవసరం: 100 km / 25.75 kmpl = 3.88 లీటర్లు. ధర: 3.88 లీటర్లు × రూ 96.65 = రూ 374.02 100 కిమీ రన్నింగ్ ఖర్చు: రూ 374.02
CNG కార్ (మారుతి స్విఫ్ట్): మారుతి స్విఫ్ట్ CNG వేరియంట్ 32.85 km/kg మైలేజీ అందిస్తుంది. CNG ధర రూ. 75.09/కిలో, ధర:
– ఇంధనం ఎంత అవసరం: 100 కిమీ / 32.85 కిమీ/కిలో = 3.04 కిలోలు.
ధర: 3.04 కిలోలు × రూ 75.09 = రూ 228.28. 100 కి.మీకి రన్నింగ్ ఖర్చు: రూ 228.28
డీజిల్ కార్ (టాటా నెక్సాన్): టాటా నెక్సాన్ డీజిల్ వేరియంట్ 24.07 kmpl మైలేజీని అందిస్తుంది. ఢిల్లీలో లీటరు డీజిల్ ధర రూ. 87.62:
ఇంధనం 100 కిమీ / 24.07 kmpl = 4.15 లీటర్లు ఫ్యూయల్ అవసరం. ధర: 4.15 లీటర్లు × రూ 87.62 = రూ 363.63 — 100 కిమీ రన్నింగ్ ఖర్చు: రూ 363.63
హైబ్రిడ్ కార్ (మారుతి గ్రాండ్ విటారా): మారుతి గ్రాండ్ విటారా (హైబ్రిడ్) 27.97 kmpl అందిస్తుంది. పెట్రోల్ ధర లీటరుకు రూ. 96.65 ఉపయోగించి:
ఇంధనం: 100 కిమీ / 27.97 kmpl = 3.57 లీటర్లు అవసరం అవుతుంది. ధర: 3.57 లీటర్లు × రూ 96.65 = రూ 345.07 — 100 కిమీ రన్నింగ్ ధర: రూ 345.07
ఎలక్ట్రిక్ కారు (టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ లాంగ్ రేంజ్): టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్, 45 kWh బ్యాటరీతో, పూర్తి ఛార్జింగ్‌కు 489 కిమీల పరిధిని క్లెయిమ్ చేస్తుంది. DC ఫాస్ట్ ఛార్జర్‌లో ఛార్జింగ్ యూనిట్‌కు రూ. 22 (సుమారుగా), ఇంట్లో, ఇది యూనిట్‌కు రూ.7 (సుమారు):
విద్యుత్ ఎంత అవసరం: 100 km / 489 km × 45 kWh = 9.2 kWh — DC ఛార్జర్ వద్ద ధర: 9.2 kWh × రూ 22 = రూ 202.40 — ఇంట్లో ఖర్చు: 9.2 kWh × రూ 7 = రూ 64.40 కోసం —
100 కి.మీ: రూ. 202.40 (DC ఛార్జర్), రూ 64.40 (హోమ్ ఛార్జర్)
ఇంట్లో ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఎలక్ట్రిక్ కారు అతి తక్కువ రన్నింగ్ ధరను కలిగి ఉంటుంది. DC ఫాస్ట్ ఛార్జర్‌లో బయట ఛార్జింగ్ చేస్తే రన్నింగ్ ధర CNG కారుకు దగ్గరగా ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేసే సమయంలో ముందస్తు ఖర్చు మిగతా కార్ల కంటే ఎక్కువగా ఉంటుంది.