Home » RG Kar case : మొత్తం కుట్ర చేసి నన్నుఇరికించారు.. కోల్‌క‌తా కేసు నిందితుడి సంచ‌ల‌న వ్యాఖ్యలు
RG Kar case

RG Kar case : మొత్తం కుట్ర చేసి నన్నుఇరికించారు.. కోల్‌క‌తా కేసు నిందితుడి సంచ‌ల‌న వ్యాఖ్యలు

Spread the love

RG Kar case | ఆర్‌జి కర్ హాస్పిటల్ రేప్ అండ్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడు, సంజయ్ రాయ్ సోమవారం షాకింగ్ కామెంట్స్ చేసాడు, కోల్‌కతా మాజీ పోలీస్ కమీషనర్ వినీత్ గోయల్ మొత్తం కేసును కుట్ర పన్నారని, అక్ర‌మంగా త‌న‌ను ఇరికించారని ఆరోపించారు. సీల్దా కోర్టు నుంచి తీసుకెళ్తున్న సమయంలో పోలీసు వ్యాను లో నుంచి ఆయన ఈ సంచ‌ల‌న‌ ఆరోపణలు చేశారు. “వినీత్ గోయల్ (మాజీ కోల్‌కతా పోలీస్ కమీషనర్) మొత్తం కుట్ర (ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ రెసిడెంట్ డాక్టర్‌పై అత్యాచారం హత్య) చేసి నన్ను ఇరికించాడని చెప్పాడు.

READ MORE  గూగుల్ మ్యాప్ సాయంతో ప్రయాణం.. కారు నదిలో పడి ఇద్దరు యువ వైద్యులు మృతి

ఈ కేసులో ఈరోజు విచారణ ప్రారంభం కావడంతో సంజ‌య్‌ రాయ్‌ను సీల్డే కోర్టుకు తరలించారు. అదనపు జిల్లా ,సెషన్స్ జడ్జి అనిర్బన్ దాస్ కోర్టులో విచార‌ణ‌లు జరిగాయి. ఈసంద‌ర్భంగా రాయ్‌ను మధ్యాహ్నం కోర్టుకు తీసుకువచ్చారు.

భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 64 (రేప్), సెక్షన్ 66 (మరణానికి కారణమైనందుకు శిక్ష), 103 (హత్యకు శిక్ష) కింద రాయ్‌పై కేసు నమోదు చేశారు. ముఖ్యంగా, RG కర్ హాస్పిటల్‌లోని సెమినార్ రూమ్‌లో డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్ మృతదేహం కనుగొన్న ఒక రోజు తర్వాత, ఆగస్టు 10న కోల్‌కతా పోలీసులు సంజ‌య్ రాయ్‌ని అరెస్టు చేశారు. అనంతరం కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసు దర్యాప్తును చేపట్టింది.

READ MORE  Trinamool Congress Menifesto : మేం అధికారంలోకి వస్తే.. ఎన్ఆర్‌సీ, సీఏఏను అమ‌లు చేయం: మ‌మ‌తా బెనర్జీ

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్