Thursday, March 27Welcome to Vandebhaarath

Tag: Andhrapradesh

Kanchi Kamakoti Peetham | సనాతన ధర్మ ప్రచారం కోసం అందుబాటులోకి శంకర విద్యాలయం
Special Stories

Kanchi Kamakoti Peetham | సనాతన ధర్మ ప్రచారం కోసం అందుబాటులోకి శంకర విద్యాలయం

Karnool : కంచి కామకోటి పీఠం (Kanchi Kamakoti Peetham) కొత్త‌గా పొదిలి (Podili) లోని ఒంగోలు సమీపంలో నిర్మించిన‌ సనాతన ధర్మ సేవా గ్రామమైన కంచి కామకోటి శంకర విద్యాలయం (sankara vidyalaya) అందుబాటులోకి వ‌చ్చింది. యువతలో సనాతన ధర్మ విలువలను పెంపొందించడమే ఈ విద్యాల‌యం లక్ష్యం. 31 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉన్న ఈ విద్యా కేంద్రంలో ఆధునిక ఇంగ్లీషు-మీడియం విద్యను వేద అధ్యయనాలు, క్రీడలు, కళలలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేయడంతో పాటు విలువ-ఆధారిత విద్యను అందించనున్నారు. అనేక సాంప్రదాయ వేద పాఠశాలలు కేవలం మతపరమైన అధ్యయనాలపై దృష్టి సారిస్తుండగా, ఈ సంస్థ వ్యాల్యూ బేస్డ్ లర్నింగ్‌తో ఆధునిక‌ బోధనా పద్ధతులను అనుసరించడం విశేషం.పాఠశాల ప్రస్తుతం 6 & 7 తరగతుల్లో 44 మంది విద్యార్థులకు సేవలను అందిస్తోంది. ఇది కులం లేదా మతంతో సంబంధం లేకుండా విద్య‌ను అందిస్తోంది .ఆధునిక విద్యలో తమను తాము అభివృద్ధి చేసుకుంటూ స్తో...
Rains | ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు
Andhrapradesh, Telangana

Rains | ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు వర్షాలు

బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రరూపం దాల్చుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర తీరాల వెంట ఈ వాయుగుండం కేంద్రీకృతమై  ఉందని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తో పాటు ,తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు పలు జిల్లాల్లో నేడు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు చెప్పారు. నేడు రాష్ట్రంలో పగటి పూట వాతావరణం పొడిగా ఉంటుందని.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఇక అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలకు అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయన్నారు. అల్పపీడనం క్రమంగా పశ్చిమ దిశగా కదులుతూ నైరుతి దానిని ఆనుకుని పశ్చిమ మధ్య బ...
Tirupati Intermodal Bus Station | తిరుపతి ఇంటర్‌మోడల్ బస్ స్టేషన్ ప్రాజెక్ట్ పై క‌ద‌లిక‌
Andhrapradesh

Tirupati Intermodal Bus Station | తిరుపతి ఇంటర్‌మోడల్ బస్ స్టేషన్ ప్రాజెక్ట్ పై క‌ద‌లిక‌

Tirupati Intermodal Bus Station | తిరుపతి: ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రమై తిరుప‌తిలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఇంటర్‌మోడల్ బస్ స్టేషన్ ప్రాజెక్ట్ పై ఎట్ట‌కేల‌కు క‌ద‌లిక వ‌చ్చింది. నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్) అధికారులు తాజాగా త‌నిఖీ చేయ‌డంతో ఇక్కడ అంద‌రి దృష్టిని ఆకర్షించింది. ఈ నిర్మాణాన్ని ఎన్‌హెచ్‌ఎల్‌ఎంఎల్ఈ, NHAI సంయుక్తంగా చేప‌ట్టాల‌ని ప్రతిపాదించారు. సెంట్ర‌ల్‌ బస్టాండ్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తితో కలిసి కంపెనీ సీఈవో ప్రకాశ్‌గౌడ్‌, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పూజా మిశ్రా పాల్గొని ఆవరణను పరిశీలించారు. సకల సౌకర్యాలతో ప్రయాణ ప్రాంగణం 13 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక హంగుల‌తో బ‌స్ స్టేషన్‌ను నిర్మించనున్నారు. ఒకే హబ్‌లో వివిధ ట్రాన్సిట్ మోడ్‌లను ఏకీకృతం చేయడం ద్వారా రహదారి రద్దీని తగ్గించడం దీని లక్ష్యం. ఈ సౌకర్యంలో ప్రయాణ...
SCR Special Trains | సికింద్రారాబాద్ – కటక్‌ మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లు..
Telangana

SCR Special Trains | సికింద్రారాబాద్ – కటక్‌ మధ్య ఎనిమిది ప్రత్యేక రైళ్లు..

SCR Special Trains | సికింద్రాబాద్‌: ప్రయాణికుల రద్దీని దృష్టిలోపెట్టుకొని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప్ర‌త్యేక రైళ్ల‌ను న‌డిపించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. సికింద్రాబాద్‌ , ఒడిశాలోని క‌టక్ మధ్య ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్‌ - కటక్‌ మధ్య రాకపోకల కోసం 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే పేర్కొంది. ప్ర‌త్యేక‌ రైళ్ల షెడ్యూల్ ఇదే.. SCR Special Trains From Secundrabad : ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 18వ తేదీ వరకు ప్రతి మంగళ, బుధవారాల‌లో ఈ ప్ర‌త్యేక రైళ్లు న‌డ‌వ‌నున్నాయని మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ రైళ్లు బయలుదేరే సమయాలను మాత్రం ఇంకా వెల్లడించలేదు.హైదరాబాద్‌ - కటక్‌ (07165) రైలు మంగళవారం, కటక్‌ -హైదరాబాద్‌ (07166) రైలు బుధవారంహాల్టింగ్ స్టేష‌న్లు.. సికింద్రాబాద్‌, నల్ల‌గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్ల...
శ్రీశైలానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ
Andhrapradesh, Telangana

శ్రీశైలానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన టీఎస్‌ఆర్టీసీ

బస్సుల ఫ్రీక్వెన్సీ పెంపు హైదరాబాద్: పర్యాటకుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టిఎస్‌ఆర్‌టిసి సోమవారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి దేవస్థానానికి ప్రత్యేక వారాంతపు టూర్ ప్యాకేజీని ప్రకటించింది.రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రతీ శనివారం ఉదయం 7 గంటలకు సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్) నుంచి బస్సు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8.30 గంటలకు తిరిగి జేబీఎస్‌కు వస్తుందని టీఎస్‌ఆర్‌టీసీ అధికారులు వెల్లడించారు.సుప్రసిద్ధ శ్రీశైలం ఆలయాన్ని సందర్శించడమే కాకుండా, పాతాళగంగ, పాలధార, పంచధార, శ్రీశైలం ఆనకట్ట, శిఖరం మొదలైన సమీప పర్యాటక ప్రదేశాల సందర్శనలను కూడా ప్యాకేజీలో చేర్చడం జరిగింది. కాగా ఈ స్పెషల్ శ్రీశైలం ప్యాకేజీ టిక్కెట్ ధర పెద్దలకు రూ. 2,700, పిల్లలకు రూ.1,570.ఈ ప్యాకేజీలోనే నాన్...