
Sankranti 2025 | సంక్రాంతికి 6,432 ప్రత్యేక బస్సులు
2025 Sankranti Special Buses | సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు హైదరాబాద్ (Hyderabad)మొత్తం నిర్మానుష్యంగా మారిపోతుంది. పండుగ సెలవులను ఎంజాయ్ చేయడానికి నగరవాసులు తమ సొంతూళ్లకు పయనమవుతారు. ముఖ్యంగా నగరంలో చేస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబాలు సంక్రాంతి సందర్భంగా ఆంధ్రాకు పెద్ద ఎత్తున ప్రయాణాలు చేస్తుంటారు. ఈ క్రమంలో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంటాయి. ఆర్టీసీ బస్సులు, రైళ్లలో కనీసం నిలబడేందుకు కూడా స్థలం ఉండదు.. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో ప్రయాణికులకు టిజిఆర్టీసీ (TGSRTC) తీపికబురు చెప్పింది.557 బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యంసొంతూళ్లకు వెళ్లే వారి కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ముందస్తుగానే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ నుంచి తెలంగాణతో పాటు ఆంధప్రదేశ్(Andhra Pradesh)కు కూడా ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణ...