Visa Free Travel : ఈ ఏడాది 2024లో భారతీయ పాస్‌పోర్ట్ 2 పాయింట్లు పెరిగి 82వ స్థానానికి చేరుకుంది. భారతీయ పాస్‌పోర్ట్‌పై 58 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీని పొందవచ్చు. వీటిలో అంగోలా, భూటాన్, మాల్దీవులు సహా అనేక దేశాలు ఉన్నాయి. 2023లో భారతదేశం 84వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఏ దేశం ఏ ర్యాంక్‌ను పొందిందో ఇప్పుడు తెలుసుకోండి..
ఒక దేశ బలం దాని పాస్‌పోర్ట్ తో నిర్ణయించవచ్చు. సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ గా గుర్తింపు పొందింది. ఇప్పుడు పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ జాబితాలో భారత్ కూడా తన స్థానాన్ని మెరుగుపరుచుకుది. UK ఆధారిత హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్ ప్రకారం ఈ జాబితాలో భారతదేశం 82వ స్థానంలో నిలిచింది.
ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) డేటా ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఇస్తారు. 2022లో భారత్ 87వ స్థానంలో ఉంది. 2023లో భారత్‌కు 84వ స్థానం లభించింది. భారతదేశ పాస్‌పోర్ట్‌లో 58 దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ ఉంది. సింగపూర్ పాస్‌పోర్ట్ ఉన్న వ్యక్తులు 195 దేశాలకు వీసా లేకుండా ప్రవేశించవచ్చు, సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్.
ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ వంటివి 192 దేశాలు, భూభాగాలకు వీసా లేకుండా సందర్శించే పాస్‌పోర్ట్‌లతో రెండవ స్థానంలో ఉన్నాయి. ఇక ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, స్వీడన్ మూడో స్థానంలో నిలిచాయి. ఈ దేశస్తులకు 191 దేశాలకు వీసా రహిత యాక్సెస్ ఉంది.
బ్రిటన్, బెల్జియం, డెన్మార్క్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్ నాలుగో స్థానంలో ఉన్నాయి. అదే సమయంలో, US ఒక దశాబ్దానికి పైగా ఇండెక్స్‌లో క్షీణిస్తోంది. ఇది కాకుండా ఆస్ట్రేలియా ఆరో స్థానంలో, అమెరికా ఎనిమిదో స్థానంలో ఉన్నాయి.
Visa Free Travel ఇక మన పొరుగుదేశం పాకిస్థాన్ విషయానికొస్తే.. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ 100వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ పాస్‌పోర్ట్ ద్వారా 33 దేశాలకు మాత్రమే వీసా ఫ్రీ ఎంట్రీ సాధ్యమవుతుంది. 2023లో పాకిస్థాన్ పాస్‌పోర్ట్ ప్రపంచంలో 106వ స్థానంలో ఉంది. అలాగే, 2023లో, పాకిస్తాన్ పాస్‌పోర్ట్‌పై వీసా లేకుండా 32 దేశాలను మాత్రమే సందర్శించగలిగారు, కానీ ఇప్పుడు 33 దేశాలను సందర్శించవచ్చు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..