Hyderabad Metro | హైదరాబాద్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారి శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. మొత్తం తెలంగాణ బడ్జెట్ 2 లక్షల 91 వేల 159 కోట్లు కాగా, రెవెన్యూ వ్యయం 2,20,945 కోట్లు ఉందని భట్టి విక్రమార్క వెల్లడించారు. కాగా, 2024 – 2025 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.500 కోట్లు కేటాయించినట్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. . ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు ( Hyderabad Metro )కు 500 కోట్ల రూపాయల కేటాయించినట్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ బడ్జెట్ లో పాతబస్తీ మెట్రో రైలు విస్తరణకు తమ ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. పాతబస్తీలో మెట్రో విస్తరణకు 500 కోట్లు, మల్టీ మోడల్ సబర్బన్ రైలు ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్‌కు రూ.50 కోట్లు ప్రతిపాదించినట్లు మంత్రి భట్టి విక్రమార్క వివరించారు.
మూసీ నది ప్రాజెక్టుకు రూ.1500 కోట్లు
కాగా హైదరాబాద్ సుందరీకరణ కోసం మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు రూ.1500 కోట్లు, గ్రేటర్ హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి కోసం రూ.10వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇందులో జిహెచ్ఎంసి పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లు ప్రతిపాదించామని చెప్పారు. శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరణకు 100 కోట్లు, హెచ్ఎండిఏ పరిధిలో మౌలిక వసతుల కోసం 500 కోట్లు, మెట్రో వాటర్ వర్క్స్ కు రూ.3385 కోట్లు, హైడ్రా కోసం రూ. 200 కోట్లు, అవుటర్ రింగ్ రోడ్డు అభివృద్ధి కోసం రూ.200 కోట్లు కేటాయించినట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..